సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం .. కుటుంబ అనుబంధాలను పెంపొందించడం నేటి అధునాతన ప్రపంచంలో అత్యావశ్యకం. బిజీ జీవితంలో పండుగలు పబ్బాల వేళ ఇంటిల్లిపాదీ ఒకచోట కలిసి సందడి చేస్తే అంతకుమించిన ఆనందం ఇంకేం ఉంటుంది.
మెగావృక్షం (మెగాస్టార్) నీడలో పెరిగిన స్టార్ కిడ్స్ అంతా ఓచోట చేరి సందడి చేసేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. సంక్రాంతి- దసరా-వినాయక చవితి- రాఖీ- క్రిస్మస్ .. ఇలా పండగ ఏదైనా కానీ ఆ రోజు మెగా హీరోలు తమ అనుకూలతను షెడ్యూళ్లను బట్టి ఓ చోట కలిసి సెలబ్రేషన్ చేసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. మెగా- అల్లు కుటుంబాలు కలిసే పండుగలను జరుపుకుంటాయి.
ఈసారి మెగా కజిన్స్ అంతా సీక్రెట్ శాంటా కోసం ఓ చోట చేరారు. క్రిస్మస్ ని పురస్కరించుకుని సీక్రెట్ శాంటా వేడుకకు చెర్రీ-బన్నీ జోడీ స్పెషల్ ప్లాన్ తో ముందుకు వచ్చారు. ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇందులో చెర్రీ- బన్ని జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని ఫోటో ఫ్రేమ్ చెబుతోంది.
ఈ పండగలో రామ్ చరణ్- అల్లు అర్జున్ వరుణ్ తేజ్-సాయి ధరమ్ తేజ్- వైష్ణవ్ తేజ్-అల్లు శిరీష్ పాల్గొన్నారు. ఆడపడుచుల్లో ఉపాసన రామ్ చరణ్- స్నేహ అర్జున్ - సుస్మిత- శ్రీజ- నిహారిక తదితరులు బోలెంత ఫన్ ని ఆస్వాధించారు.
సీక్రెట్ శాంటా అనేది బంధుమిత్రులు బహుమతులను సీక్రెట్ గా(ఎవరికి ఎవరు ఏం ఇస్తున్నారో ముందే తెలియదు) పంచుకునే ఆసక్తికర ఈవెంట్. అందరూ ఒక సమూహంగా ఏర్పడి దీనిని సెలబ్రేట్ చేయాలి. ప్రతి సభ్యుడు బహుమతిని అందించడానికి అజ్ఞాతంగా మరొక సభ్యుడిని కేటాయించాలి. మెగా కజిన్స్ అందరూ ఇందులో పాల్గొని కానుకలను ఎక్స్ ఛేంజ్ చేసుకున్నారు.. అదంతా బోలెడంత ఫన్నీ ఈవెంట్ గా మారింది.
తాజాగా మెగా శాంటా ఈవెంట్ ఫోటోని ఉపాసన కొణిదెల తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. మెగా ఈవెంట్ గ్రాండ్ సక్సెసైంది. మెగా హీరోలంతా ఓచోట చేరి చేసిన సందడి ఇప్పుడు అభిమానులకు కన్నుల పండుగగా మారింది. ఇక ఈ ఫోటోగ్రాఫ్ ని సునిశితంగా పరిశీలిస్తే.. రామ్ చరణ్ తన ఫేవరెట్ పెట్ రైమ్ ని చేత్తో పట్టుకుని ఫోజిచ్చాడు. ఉపాసన బేబి బంప్ కనిపిస్తోంది.
రామ్ చరణ్- ఉపాసన దంపతులు తమ మొదటి సంతానం గురించి ఎంతో ఆనందంగా వేచి ఉన్నారు. మెగాస్టార్ స్వయంగా ఈ శుభవార్తను అభిమానులకు చేరవేయడంతో సంబరాలు మిన్నంటాయి. చెర్రీ-ఉపాసన ఇరు కుటుంబాల్లో ఈ క్రిస్మస్ నిజంగా ఆనందాన్ని తెచ్చిందని చెప్పాలి. వచ్చే క్రిస్మస్ నాటికి చరణ్- ఉపాసన దంపతుల ఇంట్లో కొత్త అతిథి సందడిని చూడవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.