టాక్ ప్లాప్.. కానీ బాక్సాపీస్ షేక్! ఇదేం లెక్క?

Update: 2022-09-12 16:20 GMT
బాక్సాఫీస్ వ‌ద్ద అప్పుడ‌ప్పుడు మిరాకిల్స్ చోటు చేసుకుంటాయి. రివ్యూలు స‌హా ప‌బ్లిక్ టాక్  నెగిటివ్ గా వ‌చ్చినా వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించిన ఘ‌న‌త సినిమాకి సొంత‌మే. అలా వంద‌ల కోట్ల వ‌సూళ్లు  సాధించిన భార‌తీయ చిత్రాలు చాలానే ఉన్నాయి. అప్ప‌ట్లో జ‌న‌తా గ్యారేజ్ చిత్రానికి రివ్యూలు నెగిటివ్ గానే వ‌చ్చాయి. కానీ బాక్సాఫీస్ వ‌సూళ్లు చూసి అంతా ఖంగుతున్నారు.

ఇటీవ‌లే రిలీజ్ అయిన బ్ర‌హ్మాస్ర్త మొద‌టి భాగం విష‌యంలోనూ అలాంటి మిరాకిల్ చోటు చేసుకుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 200 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించిన‌ట్లు వికిపీడియా స‌మాచారం బ‌ట్టి తెలుస్తోంది. ఈ సినిమాకి రివ్యూలు స‌హా ప‌బ్లిక్ టాక్ నెగిటివ్ గానే ఉంది. కానీ వ‌సూళ్ల ప‌రంగా మూడు రోజుల్లో 200 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం అంటే ఆషామాషీ కాదు.

ఆ ర‌కంగా బ్ర‌హ్మాస్ర్త  రిలీజ్ త‌ర్వాతా వార్త‌ల్లో నిలిచింది. ఈ సంద‌ర్భంగా కొన్ని బాలీవుడ్ మిరాకిల్స్ గురించి చూస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తున్నాయి. స‌ల్మాన్ ఖాన్..సోన‌మ్ క‌పూర్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ `ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో` కి నెగిటి టాక్ వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద 207 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది.

120 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకి  తొలి షోతోనే డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చినా ఈ రేంజ్ లో వ‌సూళ్లు సాధించిందంటే? క‌మర్శియ‌ల్ గా సినిమా స‌క్సెస్ అయింద‌నే తెలుస్తోంది. అలాగే అక్ష‌య్ కుమార్..అభిషేక్ బ‌చ్చ‌న్..రితేష్ దేశ్ ముఖ్ న‌టించిన `హౌస్ ఫుల్ -3` కూడా తొలి షోతోనే ప్లాప్ రికార్డుల్లోకి ఎక్కేసింది. కానీ 85 కోట్ల‌తో తెర‌కెక్కిన సినిమా  బాక్సాఫీస్ వ‌ద్ద 110 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది.

అజ‌య్ దేవ‌గ‌ణ్..సోన‌మ్ క‌పూర్ న‌టించిన `స‌న్ ఆఫ్ స‌ర్దార్` సైతం నెగిటివ్ రివ్యూలే మూటగ‌ట్టుకుంది. 30 కోట్ల బ‌డ్జెట్ తో  నిర్మాణం జ‌రిగిన సినిమా 100 కోట్ల క్ల‌బ్ లో చేరిన చిత్రంగా నిలిచింది. అలాగే వ‌రుణ్ ధావ‌న్...జాక్వెలిన్ పెర్నాండేజ్.. తాప్సీ న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `జుడ్వా-2` కూడా విమ‌ర్శ‌కులు ఏకేసిన చిత్రంగా నిలిచింది.

కానీ 65 కోట్ల బ‌డ్జెట్ సినిమా 140 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు తెచ్చింది. బ్ర‌హ్మాస్ర మొద‌టి భాగానికి 400 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇప్ప‌టివ‌ర‌కూ బాక్సాఫీస్ లెక్క అన‌ధికారికంగా 200 కోట్లు క‌నిపిస్తుంది. ఇది నిజ‌మైతే సంచ‌ల‌నమే. ఇటీవ‌ల కాలంలో ఏ బాలీవుడ్ సినిమా ఈ రేంజ్ లో వ‌సూళ్లు సాధించింది లేదు.  ఆ లెక్క‌లో దీన్ని గొప్ప చిత్రంగా భావించినా పెట్టుబ‌డి రాని చిత్రంగా చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News