ఫోటో స్టోరీ : అందానికే అసూయ పుట్టేలా..!

Update: 2022-11-30 06:31 GMT
రెండు దశాబ్దాలుగా తన అందచందాలతో సౌత్ ఆడియన్స్ ని అలరిస్తున్న భామ తమన్నా భాటియా. శ్రీ తో టాలీవుడ్ కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు అప్పుడు పెద్దగా అవకాశాలు రాబట్టలేకపోయినా హ్యాపీడేస్ తో రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ అయితే తమన్నాకి సూపర్ క్రేజ్ వచ్చేలా చేసింది.

ఇక అప్పటి నుంచి ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన తమన్నా ఇప్పటికీ అవకాశాలు పొందుతుంది. రీసెంట్ గా F3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా ఆ మూవీలో కూడా తన మార్క్ చూపించింది.  

సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తమన్నా సూపర్ పాపులర్ అయ్యింది. ఇప్పటికీ అమ్మడికి అక్కడ అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గానే బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమాలతో వచ్చిన తమన్నా బోలే చుడియాన్ సినిమాలో నటిస్తుంది. ఇక తెలుగులో గుర్తుందా శీతాకాలం సినిమా చేయగా అది డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో పాటుగా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో జత కడుతుంది తమన్నా.  

సినిమాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కూడా రెచ్చిపోతుంది తమన్నా. అమ్మడు చేస్తున్న హాట్ షో కి ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ గా సరికొత్త ఫోటో షూట్ తో ఖుషి చేస్తుంది తమన్నా.

జిగేలు జిగేలు అనిపించే లెహంగా తో మెరుపులు మెరిపిస్తుంది అమ్మడు. లెహంగా టాప్ జాకెట్.. అది కూడా అందాలు కనిపించేలా.. అమ్మడు చేస్తున్న హాట్ షో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తెరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు అవుతున్నా తమన్నా గ్లామర్ విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు. ఇప్పటికీ మిల్కీ బ్యూటీ తన అందాలతో అదరగొట్టేస్తుంది.

తన గ్లామర్ తోనే కాదు నటనతో కూడా ఇన్నాళ్లు కెరీర్ కొనసాగిస్తూ వచ్చింది తమన్నా.. ఇప్పటికీ సీనియర్ స్టార్స్ తో పాటుగా యువ హీరోలతో కూడా జత కడుతుంది. అమ్మడి ఫాం చూస్తుంటే మరో పదేళ్లు కూడా కెరీర్ ఇలానే కొనసాగించేలా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News