మిల్కీ బ్యూటీ తమన్నా తిరుగులేని అందగత్తె. అందులో డౌటక్కర్లేదు. బాహుబలి-1లో అవంతికలా అదరగొట్టేసినా.. 100 % లవ్ లో నడుము ఒంపు చూపి బావను కవ్వించి దటీజ్ మహాలక్ష్మి అనిపించుకున్నా తమన్నాకే చెల్లింది. తమన్నా అందానికి ఆరాధకులు ఇప్పటికే ఉంటారు. అయితే సినిమాల్లోకి వచ్చి చాలా కాలం కావడంతో.. ఆమె వయస్సు 28 అయినా కూడా.. చాలా పెద్ద సీనియర్ అనే ఫీలింగ్ వచ్చేస్తోంది.
ఇన్నాళ్లు గ్లామర్ నే పండించిన తమన్నా ఇప్పుడు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ తెలుగు వెర్షన్ రీమేక్ లో తమన్నాయే హీరోయిన్. ఈ సినిమాలో తమన్నా రోల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ బయటకి వచ్చింది. ఇందులో సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ చీర కట్టుకుని పాతకాలం కళ్లజోడు.. ముక్కుపుడక పెట్టుకుని కనిపించింది. ఇందులో తమ్మూను చూసిన వారంతా ఆంటీకి అక్కలా ఉందనడం మొదలెట్టేశారు. క్వీన్ రీమేక్ అంటే రాణిలా చూపించడం మానేసి సీరియళ్లలో రాధికలా చూపిస్తున్నారా ఏంటి అనే కామెంట్లు వచ్చేస్తున్నాయి.
ఈ సినిమాకు దటీజ్ మహాలక్ష్మి అని టైటిల్ పెట్టారు. 100 %లవ్ సినిమా ఇప్పుడు చూసినా అంతా దటీజ్ మహాలక్ష్మి అంటారు. కానీ ఈ లుక్ లో తమ్మూను చూశాక దిసీజ్ నాజ్ మహాలక్ష్మి అనేయడం ఖాయం. అసలే ఈ సినిమా షూటింగ్ అష్టకష్టాల మధ్య సాగుతోంది. ఇప్పటికే ఓ డైరక్టర్ మారి కొత్త డైరెక్టర్ వచ్చాడు. ఇలాంటప్పుడు బజ్ పెంచే లుక్ బయటికొస్తే బాగుంటుంది కానీ బాధపెట్టే లుక్ వదిలితే ఎలా? అంటున్నారు కొంతమంది సినిమా లవ్వర్స్. లేటు వయస్సులో ప్రయోగాలు ఎందుకు అనేది వారి ఫీలింగ్.