వీడియో: అమ్మ పై ప్రేమను కురిపించిన మిల్కీ బ్యూటీ

Update: 2020-05-11 11:50 GMT
మదర్స్ డే ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఇంట్రెస్టింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ తో తమకున్న అనుబంధం పంచుకున్నారు. కొందరైతే కోవిడ్-19 క్రైసిస్ లో ప్రజలకు సేవలు చేస్తూ ముందువరుసలో ఉండి తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తల్లులకు జేజేలు పలికారు. ఇలా సెలబ్రిటీలు పలురకాలుగా మదర్స్ డే వీడియోలు పోస్టులు పెట్టారు. ఇలాంటి వీడియోలలో తమన్నా భాటియా వీడియో కూడా ఆకట్టుకునేలా ఉంది.

మదర్స్ డే సందర్భంగా తమన్నా పొద్దున్నే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసింది. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతకడం.. ఇంట్లో ఉండే ఫ్యాన్లు గట్రా శుభ్రం చేయడం.. చూసేవారికి నోరూరించేలా భారీగా ఓ నాలుగైదు రకాల వంట చేయడంతో మదర్స్ డే రోజు మంచి కూతురు అనిపించుకుంది. ఈ పనులన్నీ చేసిన తర్వాత అమ్మగారు రజని భాటియాను డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె అంటే ఎంత ప్రేమో వివరించింది.. హగ్ కూడా చేసుకుంది.

ఈ వీడియోకు ఇన్ స్టాగ్రామ్ లో భారీ స్పందన దక్కింది. తమన్నాను అందరూ మంచి కలర్ ఉంది కదా అని మిల్కీబ్యూటీ అనుకుంటారని కానీ మంచి మనసు కూడా ఉందని కొందరు ప్రశంసలు కురిపించారు. ఈ మదర్స్ డే విషెస్ ఎంతో అందంగా ఉన్నాయని తమన్నాను మెచ్చుకున్నారు. 24 గంటలు ఏదో ఒక పని చేస్తూ మనం తిన్నామా లేదా అని కని పెట్టుకుంటూ ఉండే అమ్మ కోసం ఇలా చేయడం ఎవరికైనా సంతోషాన్నిస్తుంది. తమన్నా అలా చేసినప్పుడు వాళ్ళ అమ్మ గారి కళ్ళలో ఆనందం మామూలుగా లేదు. తమన్నా అమ్మ ప్రేమను ఒకసారి ఈ వీడియోలో చూసేయండి.

Full View
Tags:    

Similar News