ఇప్పుడంటే ఎలెక్షన్స్ షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి సినిమా న్యూస్ కంటే పొలిటికల్ న్యూస్ కు డిమాండ్ పెరిగింది. దీంతో మీటూ వ్యవహారాలకు పెద్దగా మీడియాలో స్పేస్ దక్కడం లేదు. నిన్న మొన్నటివరకూ #మీటూ అంటే చాలు చాలామంది సెలబ్రిటీలు ఉలిక్కి పడేవారు. ఏదైనా ఒక న్యూస్ బయటకు వస్తే అసలు ఆరోపణలు నిజాలా కాదా అనేది తెలుసుకోకుండానే దోషిగా తీర్మానించే పరిస్థితి. అలా బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకున్న వారిలో బాలీవుడ్ ఫిలిం మేకర్ సాజిద్ ఖాన్ ఒకరు.
సాజిద్ ఖాన్ పై ఒకరు కాదు.. చాలామంది హీరోయిన్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. చాలామంది నటీనటులు ఆయనతో ఇకపై పనిచేయబోయమని తేల్చి చెప్పేశారు. కానీ రీసెంట్ గా మిల్కీ బ్యూటీ మాత్రం సాజిద్ ఖాన్ తో తనకెలాంటి ఇబ్బంది కలగలేదని అంటోంది. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో తమన్నా 'హిమ్మత్ వాలా' .. 'హమ్ షకల్స్' అనే రెండు బాలీవుడ్ సినిమాలలో నటించింది. అలాంటి సంఘటనలు తనకు ఎదురు కాలేదని తెలిపింది. ఫ్యూచర్ లో అతని సినిమాలో నటించేందుకు కూడా రెడీ అని వెల్లడించింది. ప్రతి ఒక్క నటికీ తనలాంటి అనుభవమే ఉంటుందని చెప్పనని.. వారికి ఎదురైన విషయంపై మాట్లాడే హక్కు వారికి ఉంటుందని ఆరోపణలు చేసిన వారి గురించి స్పందించింది.
ఒక యాంగిల్ లో ఆలోచిస్తే తమన్నా చెప్పేది నిజమే. అందరికీ లైంగిక వేధింపులు ఎదురయ్యాయని అనలేం. అలా అని తమన్నా చెప్పేది పూర్తిగా నిజమని కూడా నమ్మడం కష్టమే. ఎందుకంటే మీటూ ఆరోపణలు చేస్తే ఇతర ఫిలిం మేకర్స్ వర్క్ ఇవ్వకుండా వేధిస్తారని కూడా అనుమానం ఉంది కాబట్టి వాటి గురించి మాట్లాడకుండా ఉంటే పోతుంది కదా అని ఖాన్ సాబ్ నాతో బాగానే ఉన్నాడని అంటోందేమో. వీటిలో నిజానిజాలు పరమాత్మకెరుక..!