మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు వేదాంతం మాట్లాడేస్తోంది. అది కూడా చిన్నా చితకా వేదాంతం కాదూ.. ఏకంగా ‘‘నిన్న అనేది ఓ గుండు సున్నా... రేపు ఏం జరుగుతుందో చెప్పలేం... ఈ క్షణమే మనది’’ అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతోంది. రీసెంట్ గా ‘ఊపిరి’ చిత్రంలో నటించడం, ఆరోగ్యం సరిలేకపోతే ఓ బిలియనీర్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడ్డంతో ఇలా మారిపోయిందేమో అని జనాలు అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరే ఉంది.
‘జీవించడం అనేది ఒక కళ. మనకు దొరికిన సంతోషాల్ని దాచుకోవడం అందరికీ సాధ్యం కాదు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. ఓటములకు కుంగిపోయే స్వభావం కాదు. గతంలో ఇలాంటి విషయాల్లో నేను కూడా ఇబ్బంది పడేదాన్ని‘ అంటోంది తమన్నా. ఏ క్షణం ఏమయిపోతుందో, రేపు ఎలా ఉంటుందో అనే భయాలుండేవట ఈ వైట్ బ్యూటీకి. కానీ ఈ మధ్య ‘ఓషో’ రాసిన ‘ఆర్ట్ ఆఫ్ డైయింగ్’ అనే పుస్తకం చదివాక పూర్తిగా మారిపోయిందట.
ఇవాళ ఇప్పుడు ఆనందించడమే మనకు ముఖ్యం అంటూ నీతులు కూడా చెప్పేస్తోంది. సింపుల్ గా అయితా తనపై తనకు పూర్తి అవగాహన వచ్చేసిందట కూడా. జీవితాన్ని అనుభవించడం, ఆస్వాదించడం అంటే ఏమిటో తెలిసిపోయిందంటున్న తమన్నా.. త్వరలో ‘అభినేత్రి’గా అలరించబోతోంది.