ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలు ఇండస్ట్రీలో గడిపేసినా.. అరువు గొంతుతో రోజులు వెళ్లదీసేస్తూ ఉంటారు కొంతమంది. కానీ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు, కమిట్మెంట్ ను చూపించేందుకు.. సొంతగా డబ్బింగ్ ట్రై చేసే భామలు మరికొంత మంది ఉన్నారు. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో చిత్రం కోసం డబ్బింగ్ చెప్పి, ఆశ్చర్యపరిచింది. ప్రశంసలు కూడా దక్కించుకుంది.
ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా తనేం తక్కువ కాదని అంటోంది. అసలు తమ్మూ ఎప్పటినుంచో సొంత గొంతును వినిపించాలని ఆరాటం చూపించింది కానీ.. ఇండస్ట్రీ జనాల నుంచి సపోర్ట్ రాలేదు. కానీ ఇప్పుడు రకుల్ వాయిస్ సెట్ అయిన తీరు చూశాక.. కొత్త ప్రయోగాలు చేసేందుకు చాలామందికి ధైర్యం వచ్చింది. అందుకే తమ్మూకి సొంత డబ్బింగ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా నాగార్జున, కార్తిలతో కలిసి నటిస్తున్న 'ఊపిరి'లో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పేస్తోంది మిల్కీ.
'ఊపిరి' ట్రైలర్ లో వినిపించిన వాయిస్ తమన్నాదే. స్వీట్ గా ఉందని చెప్పకపోయినా.. తమ్మూకి తన హస్కీ వాయిస్ తో భలేగా ఆకట్టుకుంది. తొలిసారిగా ఆన్ స్క్రీన్ పై మిల్కీ సొంత గొంతు వినిపించడంతో.. ఫ్యాన్స్ కూడా భలేగా థ్రిల్ అయ్యారు. ట్రైలర్ లో ఉన్నది ఒక సెంటెన్సే అయినా.. బాగా ఆకట్టుకోవడంతో.. సినిమా మొత్తంలో తమ్మూ అందంతోపాటు స్వర సౌందర్యాన్ని కూడా వినేందుకు ఇప్పుడు చాలా మంది రెడీగా ఉన్నారు. ఇక తమిళంలో కూడా సొంత డబ్బింగ్ స్టార్ట్ చేసేస్తోంది తమన్నా. తన మరుసటి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి ధర్మదురైలో కలిసి నటిస్తుండగా... ఈ మూవీ కోసం తమిళ్ లోనూ ఓన్ డబ్బింగ్ చెప్పనుందట.