ఇలా బీచ్ లో కాక్ టైల్ ప్ర‌చార‌మేల మిల్కీ?

Update: 2022-06-08 04:29 GMT
ఇటీవ‌లి కాలంలో ఆల్క‌హాల్ కంటెంట్ కి ప్ర‌చారం టూమచ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో ఫేవ‌రెట్ హాట్ గాళ్స్ తో ఇలాంటి ప్ర‌చారం చేయించుకునేందుకు ఆల్క‌హాల్ బ్రాండ్లు భారీ ప్యాకేజీల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. అదే క్ర‌మంలో స్టార్ హీరోయిన్లు ఈ ప్యాకేజీల కోసం ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తున్నారు. దీనిపై ఇప్ప‌టికే నెటిజ‌నుల్లో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఆల్క‌హాల్ ప్ర‌క‌ట‌న‌ల్లో ఎమీ జాక్స‌న్.. కాజ‌ల్.. ఇలియానా.. నిధి అగ‌ర్వాల్.. పూజాహెగ్డే.. రాయ్ ల‌క్ష్మీ.. స్నేహా ఉల్లాల్.. ఇలా ఎంద‌రో క‌థానాయిక‌లు న‌టించిన వీడియోలు ఇంత‌కుముందు వెబ్ లో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కూడా అందుకు అతీతం కాద‌ని ప్రూవైంది.

తాజాగా మిల్కీ వైట్ బ్యూటీ ప్ర‌ఖ్యాత సింగిల్ ట‌న్ స్కాచ్ .. విస్కీ బ్రాండ్ కి ప్ర‌చారం చేస్తున్న వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. మిల్కీ ఎంతో స్మార్ట్ గా అలా ర్యాంప్ వాక్ చేస్తోంది.

బీచ్ ప‌రిస‌రంలో కాక్ టైల్ మిక్సింగుని సెల‌బ్రేట్ చేస్తోంది. సింగిల్ ట‌న్ కి కావాల్సినంత ప్ర‌చారం చేస్తోంది. అయితే ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్స్ ఉన్న త‌మ‌న్నా బాధ్య‌త మ‌రిచి ఇలాంటి ప్ర‌చారం చేయ‌డం స‌రైన‌దేనా? అంటూ ఒక సెక్ష‌న్ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

అయినా కెరీర్ పై దృష్టి సారించ‌క ఇలాంటి త‌ప్పుడు మార్గ‌పు ఆదాయం త‌న‌కు అవ‌స‌ర‌మా? అని కూడా ఒక సెక్ష‌న్ ప్ర‌శ్నిస్తోంది. మ‌రి వీట‌న్నిటికీ మిల్కీ వైట్ బ్యూటీ రెస్పాండ్ అవుతుందా?  ఇక‌నైనా ర‌జ‌నీ- ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని మంచి దారిలో వెళుతుందేమో చూడాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

తమన్నా భాటియా ఇటీవ‌లి కెరీర్ ని ప‌రిశీలిస్తే.. బాహుబలి- సైరా నరసింహ రెడ్డి వంటి పాన్ ఇండియా చిత్రాలలో న‌టించి కంబ్యాక్ అయ్యింది. తదుపరి వెంకటేష్- వరుణ్ తేజ్- మెహ్రీన్ పిర్జాదాతో కలిసి  F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తుంది. ఈ చిత్రం మే 27న విడుదలైంది. త‌దుప‌రి నవాజుద్దీన్ సిద్ధిఖీతో బోలే చుడియాన్ .. రితీష్ దేశ్‌ముఖ్ తో 'ప్లాన్ ఏ ప్లాన్ బి' చిత్రాల్లోనూ న‌టిస్తోంది. త‌మ‌న్నా న‌టించిన ఇత‌ర తెలుగు సినిమాలు విడుద‌ల‌కు రానున్నాయి. బాలీవుడ్ లో మ‌ధుర్ భండార్కర్ తో క‌లిసి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.


Full View

Tags:    

Similar News