తమ్మూ 60 లక్షలు తీసుకుందా?

Update: 2017-09-16 09:42 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా మహా స్పీడ్. కెరీర్ విషయంలో ప్లానింగ్ బాగానే ఉంటుంది కానీ.. అమ్మడి ఖాతాలో హిట్స్ పెద్దగా ఉండవ్. సౌత్ తో పాటు నార్త్ లోనూ కొన్ని ప్రయోగాలు చేసింది కానీ అవేవీ సక్సెస్ కాలేదు. అయితే.. హిట్స్ కౌంట్ తక్కువగా ఉన్నా.. ఈ భామ చేతిలో సినిమాల కౌంట్ మాత్రం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది.

ఒకదాని వెనక ఒకటి చొప్పున.. ఒకేసారి 2-3 సినిమాలు చొప్పున చేసేస్తూ.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం కాపాడుకుంటోంది. మరోవైపు ఐటెం సాంగ్స్ లో మెప్పించడం కూడా ఈ పాలనురుగు భామకు బాగా అలవాటయిపోయింది. ఆ మధ్యన అల్లుడు శీను.. గతేడాది స్పీడున్నోడు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. మిల్కీ ఐటెం పాటలకు మాత్రం బోలెడంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే వారంలో విడుదల కానున్న ఎన్టీఆర్ మూవీ జై లవ కుశ చిత్రంలో కూడా ఓ ఐటెం పాటలో నర్తించింది మిల్కీ. అయితే.. బెల్లంకొండ సినిమాల్లో ఐటెం పాటల కోసం 60 లక్షల రూపాయలు తీసుకుందని టాక్.

ఇప్పుడెంత పుచ్చుకున్నావ్ మిల్కీ అని అడిగితే.. 'ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు. అతడితో కనిపించే అవకాశం వస్తే డబ్బుల గురించి ఆలోచిస్తానా' అంటోంది తప్ప.. అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. అయితే.. 50 లక్షల వరకూ గిట్టిందని ఓ టాక్ ఉందిలెండి.
Tags:    

Similar News