బాహుబలిః ది కంక్లూజన్ సినిమా చుట్టూ చాలా రోజుల నుండి చాలా రూమర్లు చెక్కెర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అనుష్క ఇంకా వెయిట్ తగ్గకపోవడం.. దాని కారణంగా రాజమౌళికి షూటింగ్ టెన్షన్ పట్టుకోవడం.. ఇలా చాలా వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్లకు సీక్వెల్ గా మరో కొత్త ట్విస్టు కూడా వినిపిస్తోంది.
నిజానికి ఈ సెప్టెంబర్ నుండి మిల్కీ బ్యూటి తమన్నా ఫుల్లుగా ఖాళీ. కాని కొత్తసినిమాలేవీ ఒప్పుకోవట్లేదు. అందుకు కారణం ఏంటంటే.. అమ్మడు ఇప్పుడు బాహుబలి 2 సినిమా షూటింగులో పాల్గొనుందట. వాస్తవంగా చెప్పాలంటే.. బాహుబలిని రెండు ముక్కలుగా రిలీజ్ చేయాలని ఫిక్సయినప్పుడు.. అప్పట్లో మొదటి భాగం నిడివి పెంచడానికి ఈ కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో భాగంగా ఈమెకు కాస్త పెద్ద రోల్ వచ్చింది. అయితే రెండో భాగంలో ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి.. మొత్తంగా అనుష్కే కనిపించాలి. కాని ఇప్పుడు ఆమె సన్నబడకుండా షూటింగుకు రావడానికి కాస్త ఇబ్బంది పెడుతుండటంతో.. అనుష్క పాత్ర లెంగ్త్ తగ్గించి.. సినిమాలో మిల్కీ వాటాను పెంచారని తెలుస్తోంది.
మొన్నటివరకు కేవలం తమన్నా పాత్ర రెండో భాగంలో ఒక పాట మరికొన్ని సీన్లు మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు ఆమెకు మరో రెండు పాటలతో పాటు.. ఏకంగా యుద్ద సీన్లను కూడా చేతిలోపెట్టాడట రాజమౌళి. అనుష్క పాత్ర తగ్గకపోతే మరి సడన్ గా తమన్నాకు ఇంతటి వాటా ఎలా పెరిగి ఉంటుంది?