కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో సెలబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని రకరకాలుగా వాడుకుంటున్నారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే హీరోహీరోయిన్లు తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త ఛాలెంజ్ లకు శ్రీకారం చుడుతూ కాలం వెలిబుచ్చుతున్నారు. ఇంట్లో చేసే వంటల వీడియోలను.. హోమ్ వర్క్ ఔట్ వీడియోలను..టిక్ టాక్ వీడియోలను.. డ్యాన్స్ వీడియోలను.. ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. మొత్తం మీద ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న సెలబ్రిటీలు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. కొందరు సెలబ్రెటీలు మాత్రం ఇన్ని రోజులు తమలో దాగున్న ఇతర నైపుణ్యాలను బయటపెడుతున్నారు. మరికొందరు కరోనా వల్ల కావాల్సినంత సమయం దొరకడంతో వారి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొనే పనిలో పడ్డారు. చిన్నప్పటి నుండి నేర్చుకోవాలని సమయం దొరక్క వదిలేసిన వాటిని ఇప్పుడు ఈ కరోనా హాలిడేస్ లో నేర్చుకోడానికి ట్రై చేస్తున్నారు.
మన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే చేస్తోంది. ఇంతకముందు తన మదర్ టంగ్ సింధీని తన మదర్ నుండి నేర్చుకుంటున్నానంటూ వెల్లడించింది. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ్మూ బేబీ మరో విషయాన్ని బయటపెట్టింది. లాక్ డౌన్ టైములో తమన్నా తన తల్లి నుండి సింధీ రుచికరమైన వంటలను ఎలా వండాలో కూడా నేర్చుకుంటోందట. గత దశాబ్ద కాలంగా సినిమాలతో బిజీగా గడుపుతున్న మిల్కీ బ్యూటీకి తన మాతృబాష మరియు సింధీ వంటలు నేర్చునే టైం దొరకలేదంట. సో ఇప్పుడు దొరికిన ఈ సమయాన్ని వాటిని నేర్చుకోడానికి యూస్ చేసుకుంటోంది తమన్నా. మొత్తం మీద ఈ కరోనా పుణ్యమా అని సెలబ్రిటీలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే కాకుండా మిగిలిపోయిన కోర్కెలను నెరవేర్చుకుంటున్నారన్నమాట.
ఇదిలా ఉండగా గత ఏడాది ఏడు సినిమాల్లో నటించిన మిల్కీ బ్యూటీ ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన డాంగ్ డాంగ్ అనే పాటలో చిందులేసింది. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది తెరకెక్కిస్తున్న 'సీటీమార్' సినిమాలో తమన్నా ఇంతకు ముందు ఎప్పుడు యాక్ట్ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తోందట. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి గా కనిపించబోతోంది. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా కనిపిస్తుండగా.. తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిస్తోంది. ఈ సినిమాతో మిల్కీ బ్యూటీ మళ్ళీ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుందేమో చూడాలి.