బాహుబలిలో అవంతికగా మిల్కీ బ్యూటీ తమన్నా మెరిసిపోయింది. ప్రస్తుతం రెండు తమిళ్ సినిమాలను ఏక కాలంలో చేస్తున్న తమన్నా.. అవి కంప్లీట్ కాగానే బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ కు రానుంది. ఈ రెండో భాగంలో తన రోల్ తక్కువగానే ఉంటుందనే విషయం తమ్మూకు బాగానే తెలుసు. దీనికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ను మిల్కీకి రీసెంట్ గా వివరించాడట జక్కన్న.
బాహుబలి2 లో దాదాపు ఫినిషింగ్ లో మాత్రమే తమన్నా రోల్ కనిపించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది చిన్న పాత్రే. మరి అభిమానులు నిరుత్సాహపడకుండా ఉండేందుకు.. ఏం చేయాలనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేంది. మొదటి భాగంలో 'పచ్చ బొట్టేసినా' పాటలో తమ్మూ తన బ్యాక్ లెస్ అందాలను ఏ స్థాయిలో ప్రదర్శించిందో చూశాం. ఇప్పుడు అంతకు మించిన వయ్యారాలు ఒలకబోసేలా.. ఓ పాటను తీయనున్నారని తెలుస్తోంది.
అయితే పచ్చబొట్టేసిన పాట విషయంలో 'అవంతికపై రేప్' అంటూ ఓ లేడీ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. అలాగే ఓ అమెరికా మహిళ కూడా జక్కన్నపై ఆరోపణలు చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. మరిప్పుడు తమన్నాను అందులో కంటే హాట్ గా చూపిస్తే.. ఇంకెన్ని రకాల విమర్శలు వస్తాయో!