డోంట్ రష్ ఛాలెంజ్ లో తమన్నా ఊహించని ట్విస్ట్..!

Update: 2021-03-30 14:40 GMT
సినీ సెలబ్రిటీలు ఈ మధ్య సోషల్ మీడియాలో క్రేజీ ఛాలెంజెస్ చేసుకుంటారు. అందుకు తగ్గట్టుగా సెలబ్రిటీలు అందరూ స్పందించడంతో ఆ ఛాలెంజ్ కాస్తా దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. ప్రస్తుతం అలాంటి ఛాలెంజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఛాలెంజ్ ఏంటంటే.. ఇంగ్లీష్ పాపులర్ 'డోంట్ రష్' అనే పాటకు ఎవరి స్టైల్లో వారు డాన్స్ చేసి ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియో పోస్ట్ చేయాలి. ఈ ఛాలెంజ్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. అందరూ హీరోలు హీరోయిన్స్ కూడా చురుకుగా ఈ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా.. డిఫరెంట్ స్టైల్లో డోంట్ రష్ ఛాలెంజ్ స్వీకరించి వీడియో పోస్ట్ చేసింది. దాదాపుగా అందరూ ఆ సాంగ్ పై డాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే తమన్నా మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ బాహుబలి అవంతిక.. డోంట్ రష్ ఛాలెంజ్ ను తియ్యని మామిడి పండు తినేందుకు స్వీకరించింది. అవును నిజంగానే తమన్నా.. డోంట్ రష్ పాటకు మామిడి పండు తింటూ అందంగా హావభావాలు పలికించింది. బెడ్ పై కూర్చొని, పడుకొని, ఊగుతూ ఇలా అన్నివిధాలా అమ్మడు సాంగ్ పై స్పందించింది. అలాగే వీడియోతో పాటు 'గజిబిజిగా ఉండండి. బురా నా మనో, హోలీ హై!' అంటూ కాప్షన్ జోడించింది. తమన్నాకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం చాలా ఇష్టం. అందుకే తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో పాల్గొన్న ఫోటోస్ షేర్ చేసుకుంది. టాప్ టు బాటమ్ పింక్ డ్రెస్ లో తమన్నా అదరహో అనిపించిందని చెప్పాలి. ప్రస్తుతం అమ్మడు అటు బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాలు కూడా చేస్తోంది. బాలీవుడ్ లో తమన్నా.. బోలె చుడియాన్ సినిమా చేస్తూనే తెలుగులో సీటిమార్, మాస్ట్రో, గుర్తుందా శీతాకాలం సినిమాలు చేస్తోంది.


Full View
Tags:    

Similar News