షాకిస్తున్న‌ త‌మ‌న్నా సొంత ఇంటి బ‌డ్జెట్..!

Update: 2021-03-21 14:36 GMT
దాదాపు 16 ఏళ్ల కెరీర్ లో 50 పైగా చిత్రాల్లో న‌టించిన మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా ఒక్కో సినిమాకి కోటి పైగా పారితోషికం అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ భామ ఇటీవ‌లే ముంబైలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుక్కుంది. ఈ ఇంటికి అవ‌స‌ర‌మ‌య్యే ఇంటీరియ‌ర్ బాధ్య‌త‌ల‌న్నీ త‌న త‌న తండ్రి గారే ద‌గ్గ‌రుండి చూసుకున్నారని తాను కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నా అన్నీ తానే అయ్యార‌ని వెల్ల‌డించింది.

త‌న సొంత ఇంటి వీడియోని షేర్ చేసిన త‌మ‌న్నా అందులో స‌క‌ల‌సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్నాయ‌ని ఈ ఇంట్లో ప్ర‌తిరోజూ కొత్త‌గా ఉంటుంద‌ని ఆనందం వ్య‌క్తం చేసింది. ఓ ప్రముఖ పెయింటింగ్స్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తన ఇంటిని పరిచయం చేస్తూ అన్ని వివ‌రాల్ని వెల్ల‌డించింది.

ఎనిమిదేళ్లుగా  ముంబైలో అదే చోట నివ‌శిస్తున్నామ‌ని.. షూటింగుల రీత్యా తాను ఔట్ డోర్ కి వెళ్లినా తిరిగి సొంత ఇంటికి వ‌చ్చాక చాలా హ్యాపీగా ఉంటాన‌ని త‌మ‌న్నా వెల్ల‌డించింది. తాను వీకెండ్స్ లో స‌ర‌ద‌గా గ‌డిపే  పెంపుడు కుక్కను కూడా పరిచయం చేసింది. ఇంత‌కీ ఈ ఇంటి కోసం ఎంత వెచ్చించి ఉంటుంది? అంటే సుమారు 20కోట్ల పైమాటేన‌ని అంచ‌నా వేస్తున్నారు నిపుణులు.

తమన్నా ప్రసుత్తం కెరీర్ ప‌రంగా బిజీ బిజీగా ఉంది. గోపీచంద్  స‌ర‌స‌న న‌టించిన సీటీమార్ రిలీజ్ కి వ‌స్తోంది. అనీల్ రావిపూడి ఎఫ్ 3తో పాటు సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలతో బిజీగా ఉంది.


Full View

Tags:    

Similar News