స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా నటించిన తొలి OTT సిరీస్ `లెవంథ్ అవర్` నేటి (ఏప్రిల్ 9న) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఏప్రిల్ 7న మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. అప్పటి నుండి 7 లక్షలు పైగా వీక్షణలను యూట్యూబ్ లో సంపాదించింది. ఈ కార్పొరేట్ థ్రిల్లర్ లో తమన్నా ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. కార్పొరేట్ యుద్ధంలో గెలుపే ధ్యేయంగా పోరాటం సాగించే కంపెనీ యజమానురాలిగా తమన్నా కనిపించనుంది.
ప్రతి మలుపులోనూ విరోధులతో పోరాడే ఆరత్రికా రెడ్డి పాత్రలో తమన్నా కనిపిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ ఎనిమిది ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఉపేంద్ర నంబూరి 2017 పుస్తకం 8 అవర్స్ స్ఫూర్తితో తెరకెక్కింది.
పరిస్థితులు చేజారే క్రమంలో బోర్డు రూం సవాలును గెలవడానికి ఆరత్రికా రెడ్డి ఎంచుకున్న మార్గం ఏమిటన్నది ఈ సిరీస్ లో చూడాల్సి ఉంటుంది. వెబ్ సిరీస్ లో తమన్నా మునుపెన్నడూ చూడని అవతారంలో కనిపించడం ఆసక్తిని కలిగించింది.
ఈ సిరీస్ గురించి దర్శకుడు మాట్లాడుతూ..``దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాను. నా తొలి వెబ్ సిరీస్ ఇది. ఓ హోటల్ లో రాత్రి 11 గంటల నుంచి 8 ఏఎం వరకు జరిగే కథ ఇది. ఈ తక్కువ సమయంలోనే ఆరత్రికా రెడ్డి (తమన్నా) బ్యాంకుకి 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇంతకీ ఆమె డబ్బులు చెల్లించిందా? లేదా అనేదే కథాంశం. 42రోజుల్లో చేయాల్సిన షూట్ ని 33 రోజుల్లోనే పూర్తి చేయగలిగాం. తొలి నాలుగు ఎపిసోడ్లు ఓ తరహా. చివరి నాలుగు ఎపిసోడ్స్ అంతే రేసీగా ఉంటాయి. సెన్సార్ కట్స్ ఉండవు`` అని తెలిపారు.
గోపీచంద్ సరసన సీటీమార్ లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రానుంది. అలాగే నితిన్ తో కలిసి అంధాధున్ రీమేక్ `మాస్ట్రో`లోనూ నాయికగా నటిస్తోంది. టబు ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తారు.