మిల్కీ బ్యూటీ తమన్నా అనగానే ప్రేక్షకులు ఆమె అందాన్ని ఊహించుకుంటారు.. ఆ తర్వాతే ఆమె నటన ఇతర విషయాల గురించి ఆలోచిస్తారు. అలాంటి తమన్నా సినిమా లేదా వెబ్ సిరీస్ అనగానే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా అందంగా కనిపించాలి.. ఆమె అందాల ఆరబోతతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటప్పుడే ఆమె సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా నడుస్తుంది.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలా కాదని ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ డీ గ్లామర్ రోల్ చేసినా.. కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా సినిమాలు చేసినా లేదా వెబ్ సిరీస్ ల్లో నటించినా జనాలు వాటిని తిరష్కరిస్తారని మరో సారి నిరూపితం అయ్యింది.
హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతున్న ఈ సమయంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓటీటీ వైపు అడుగులు వేసింది. కొన్ని రోజుల క్రితం ఆహా ద్వారా '11th అవర్' వెబ్ సిరీస్ తో వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. మిల్కీ బ్యూటీ తమన్నా ను జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఆమెను మేకర్స్ చూపించడంలో విఫలం అయ్యారు. దాంతో ఆ వెబ్ సిరీస్ నిరాశ పర్చింది. ఆహాలో పెద్దగా ఆ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. ఆ వెబ్ సిరీస్ వచ్చిన కొన్ని వారాల గ్యాప్ లోనే నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ తో డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కూడా నిరాశ పర్చింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రూపొందించారు. స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉండటంతో పాటు తమన్నా అభిమానులు కోరుకునే ఎలాంటి ఎలిమెంట్స్ కూడా ఆ వెబ్ సిరీస్ లో లేవు. దాంతో నవంబర్ స్టోరీ కూడా నిరాశ పర్చింది. మిల్కీ బ్యూటీ ఈ రెండు వెబ్ సిరీస్ లను కూడా ఒప్పుకుని తప్పు చేసిందనిపిస్తుంది. పారితోషికం కోసం ఈ వెబ్ సిరీస్ లను చేసినట్లుగా ఉంది.
ముందు ముందు ఇలాంటి వెబ్ సిరీస్ లను ఆమె చేయక పోవడం మంచిది. తన నుండి అభిమానులు ఏం ఆశిస్తున్నారనే లాజిక్ ను తమన్నా మిస్సవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఆలోచనతో కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన వెబ్ సిరీస్ ను చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి మూడవ వెబ్ సిరీస్ తో అయినా మిల్కీ బ్యూటీ సక్సెస్ ను దక్కించుకుంటుందేమో చూడాలి.