హీరోకు గన్‌ పెట్టిన ఆర్మీ.. తృటిలో చావు తప్పింది

Update: 2019-02-13 09:48 GMT
దినేష్‌ హీరోగా అతిరాయ్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న చిత్రం 'ఇరందం ఉలగపోరిన్‌ కడైసి గుండు'. ఈ చిత్రంను 'కాలా', 'కబాలి' చిత్రాల దర్శకుడు రంజిత్‌ పా నిర్మించడం విశేషం. తన శిష్యుడు అతిరాయ్‌ దర్శకత్వంలో మీడియం బడ్జెట్‌ తో రంజిత్‌ పా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ తమిళనాడులోని ఒక హైవేపై చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ లో భాగంగా హీరో లారీ డ్రైవ్‌ చేస్తూ ఉండాలి. అయితే అది స్టీరింగ్‌ వదిలేసి, డోర్‌ ను పట్టుకుని వేలాడుతూ డ్రైవ్‌ చేస్తూ ఉండాలి.

కెమెరా లారీలో పెట్టి చిత్రీకరణ చేస్తున్నారు. లారీ మెల్లగా వెళ్తుంది, దినేష్‌ లారీలోంచి బయటకు వచ్చి డోర్‌ పట్టుకుని వేలాడుతున్నారు. ఈ విషయాన్ని అటువా వెళ్తున్న ఆర్మీ కమాండో వాహనంలో ఉన్న జవాన్‌ లు గమనించారు. ఆ లారీని ఓవర్‌ టేక్‌ చేసి లారికి అడ్డంగా తమ వెయికిల్‌ ను పెట్టి ఆపేయడం జరిగింది. దినేష్‌ కిందకు తిగగానే జవాన్‌ లు హీరోకు గన్‌ షూట్‌ పెట్టారు. రోడ్డుపై విన్యాసాలు ఏంటీ అంటూ ప్రశ్నించ సాగారు. ఆ సమయంలోనే దర్శకుడు దూరం నుండి ఆగండి అంటూ గట్టిగా అరుస్తూ వచ్చాడు.

అది షూటింగ్‌ అని, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ సీన్‌ ను చిత్రీకరిస్తున్నట్లుగా దర్శకుడు వివరించడంతో జవాన్‌ లు గన్‌ తీశారు. కాస్త అటు ఇటు అయినా కూడా హీరోను జవాన్‌ లు పిట్టను కాల్చినట్లుగా కాల్చే వారు అంటున్నారు. హీరో దినేష్‌ కు ఎక్కువగా గుర్తింపు లేక పోవడం వల్ల జవాన్‌ లు అతడిని గుర్తించలేదు. అందువల్ల ఈ సంఘటన జరిగింది.
Tags:    

Similar News