ఆస్కార్ ప్ర‌చారంతోనే వాళ్ల‌లో మంట మొద‌లైందా?

Update: 2022-08-20 07:20 GMT
ఆస్కార్ అవార్డుల గురించి ఎన్నడూ లేనంతగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ సాగుతోంది. దానికి కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడమే. అతడు 'ఆర్.ఆర్.ఆర్' తరపున ఉత్తమ నటుడు కేటగిరీకి నామినేట్ అయ్యేందుకు ఛాన్సుంది (పాజిబిలిటీస్ పరిశీలన) అంటూ  కథనాలు వెలువ‌డుతోన్న సంగ‌తి  తెలిసిందే.

పాపులర్ వెరైటీ మ్యాగజైన్ లో ఇలాంటి కథనం రావడంతో ఫ్యాన్స్  లో ఎగ్టైట్ మెంట్ మొద‌లైంది.  నిజానికి ఇలాంటి అవకాశం చాలా అరుదు. కానీ ఆర్.ఆర్.ఆర్ పేరు ఆస్కార్ బరిలో ఇప్పుడు మార్మోగుతోంది.  ఆస్కార్ బ‌రిలో తొలిసారి ఓ తెలుగు సినిమా టైటిల్..న‌టుడు పేరు తెర‌పైకి రావ‌డంతోనే  నెట్టింట ప్రచారం  పీక్స్ కి చేరుతుంది.

'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' చిత్రాల‌కు గ్లోబ‌ల్ స్థాయిలో ద‌క్కిన గుర్తింపు నే ఈ క్రేజ్ కి ప్ర‌ధాన  కార‌ణంగా చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలో  తెలుగు ఆర్ ఆర్ ఆర్ కి ఇండియా నుంచి నామినేష‌న్స్ లో చోటు ద‌క్కుతుంద‌ని ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇక ఉత్త‌రాది ప్రేక్షకులు 'ది కాశ్మీర్ ఫైల్స్' ఉత్తమ విదేశీ భాషా చిత్రాల విభాగంలో ఆస్కార్ 2023కి నామినేట్ అవుతుందని అంతే  నమ్మకంగా ఉన్నారు.

ఇప్ప‌టికే   అనేక సర్వేలు క‌శ్మీర్ ఫైల్స్ కి పాజిటివ్ గా వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.  దీంతో ఈ రెండు చిత్రాలలో దేనిని  ఆస్కార్‌కు పంపాలనే దానిపై  జోరుగా చ‌ర్చ‌లు సైతం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. విదేశీయులు మెచ్చిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది. గ్లోబ‌ల్ స్థాయిలో ఆ సినిమాకి గుర్తింపు ద‌క్కింది. కానీ 'క‌శ్మీర్ ఫైల్స్' కేవ‌లం దేశీయంగానే ప‌రిమితం. కానీ కంటెంట్ ప‌రంగా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉంటుంది.

ఇదంతా కేవ‌లం గెస్సింగ్ మాత్ర‌మే. భార‌త్ నుంచి ఆస్కార్ రేసులో చాలా సినిమాలుంటాయి. వాటి వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ గా నిల‌వ‌డంతోనే 'ఆర్ ఆర్ ఆర్' ..'క‌శ్మీర్ ఫైల్స్' పేర్లు ప్ర‌ధానంగా  తెర‌పైకి వ‌స్తున్నాయి.

మరోవైపు  దశాబ్దాలుగా అద్భుతమైన నటనతో  వెండి తెర‌ని ఏల్తోన్న దిగ్గ‌జాల‌గా  కమల్‌హాసన్‌.. రజనీకాంత్‌.. విక్రమ్ లాంటి ఉన్నారు.  ఇంత వ‌ర‌కూ ఆస్కార్ రేసులో ఏనాడు ఆ న‌టుల చిత్రాలు నిలువ‌లేదు. అలాంటింది ఇప్పుడు ఒక సినిమాతో ఎన్టీఆర్‌లాంటి యువ నటుడు పేరుని తెర‌పైకి తీసుకురావ‌డంపై  తమిళ సినీ అభిమానులు గుర్రుగా నూ  ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News