బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటవుతోంది. ఇప్పటికే ప్రభాస్ నుంచి కొలతలు ఫోటోలు తీసుకెళ్లగా.. వచ్చే ఏడాది మార్చిలో టుస్సాడ్స్ లో వాక్స్ స్టాట్యూ ఏర్పాటవుతోంది. సౌత్ ఇండియా నుంచి ఈ అరుదైన గౌరవం అందుకున్న తొలి నటుడిగా ప్రభాస్ రికార్డుల్లోకి ఎక్కేస్తున్నాడు. అయితే.. అనేక మంది మహామహులను వదిలేసి ప్రభాస్ విగ్రహాన్నే ఏర్పాటు చేయడం ఏంటనే వాదన చాలామంది నుంచే వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళ మీడియాలో రచ్చ చేసిపాడేస్తున్నారు.
'బాహుబలితో ప్రభాస్ రేంజ్ పెరిగిందనే మాట వాస్తవమే. అయితే.. సినిమాల వరకూ చూసుకున్నా ఎంజీఆర్ విగ్రహం ఉండాలి. సినిమాల నుంచి వచ్చి లీడర్ మారిన వారిలో యూఎస్ ఏ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ కంటే ముందే.. ఎంజీఆర్ ముఖ్యమంత్రి. అలాగనే కమల్ హాసన్ విగ్రహం ఏర్పాటు కావాలి కదా' అంటున్నారు నిర్మాత ధనంజయన్ గోవింద్. 'ఎంజీఆర్ - శివాజీ గణేసన్.. మమ్ముట్టి.. మోహన్ లాల్ ఇలా సౌతిండియా యాక్టర్ల విగ్రహాలు పెట్టడానికే ఓ మ్యూజియం పెట్టాలి' అంటున్నారు. 'కమల్.. రజినీకాంత్ ల విగ్రహాలు కూడా ఏర్పాటు కావాలి. ఇతర నటులకు ప్రభాస్ గేట్ ఓపెన్ చేశాడు' అంటోంది కాస్త ఆశాభావం వ్యక్తం చేసింది ఖుష్బూ.
ఇప్పుడున్న సౌత్ ఇండియా నటులను చూసుకుంటే.. ముందు కమల్ విగ్రహమే ఏర్పాటు కావాలనే డిమాండ్ తమిళుల నుంచి గట్టిగానే వస్తోంది. ఇందులో ప్రభాస్ విగ్రహం ఏర్పాటును సపోర్ట్ చేసే వారితో పాటు వ్యతిరేకిస్తున్నవారు కూడా ఉన్నారు. తమిళుల ఐక్యత చూశారా.. దీని తస్సారవలా బడ్డూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/