మెగాస్టార్ కం బ్యాక్ మూవీగా రూపొందిన ఖైదీ నంబర్ 150.. రైతుల సమస్యలు.. రైతు ఆత్మహత్యల బేస్ గా సాగుతుందనే విషయం.. ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ పోరాటం.. హృదయాలను కదిలించేసింది. తమిళనాడుకు చెందిన కొందరు రైతులు.. ఢిల్లీ చేరుకుని నిరసన దీక్ష చేశారు.
మహిళలంతా కేవలం పెట్టీకోట్స్ తోను.. పురుషులు కేవలం అంగ వస్త్రం ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. మట్టి పాత్రలతో బిచ్చం ఎత్తుకోవడంతోపాటు.. వీరి చేతుల్లో ఉన్న పుర్రెలు అందరినీ ఆలోచింప చేశాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలను బయటకు తీసి.. వాటినే భిక్ష పాత్రలుగా మలిచి మరీ భిక్షాటన చేశారు. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టుతో పాటు.. ఎన్నో అప్పులు చేసిన తమకు.. తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన 3వేల రూపాయల నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదని వీరు చెప్పారు. కేంద్రాన్ని కదిలించేందుకే ఈ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. రైతు పోరాటం ఢిల్లీ వరకూ చేరుకోవడం అభినందనీయమే.
సరిగ్గా చెప్పాలంటే.. ఖైదీ నంబర్ 150 చిత్రంలో ఇలాంటిదే మరో పోరాటాన్ని చూపుతారు. ఇప్పుడు రైతు సమస్యలపై సినిమా తీయాలని భావిస్తే.. వారికి సరైన ప్లాట్ మరొకటి దొరికినట్లే. వాళ్ల పోరాటాన్ని సినిమా స్టోరీగా చూడ్డం కాదు ఇది. సమస్యకు ప్రచారం కల్పించడానికి సినిమా కంటే ఉత్తమమైన విధానం మరొకటి ఉండదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/