సినిమా ల నుండి వెబ్ సిరీస్ ల వరకు అన్నింటిని కూడా కాపీ చేసి పైరసీ వెర్షన్ ను ఆన్ లైన్ లో ఉంచడం ద్వారా నిర్మాతలకు వందల కోట్ల నష్టం ను కలిగిస్తున్న తమిళ్ రాకర్స్ పై తమిళంలో ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. 'తమిళ్ రాకర్స్' అనే టైటిల్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను ఈనెల 19న స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ లో వెబ్ సిరీస్ లో ఏం చూపించబోతున్నారు అనే విషయాన్ని క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేశారు. కేవలం తమిళ్ రాకర్స్ కు చెందిన వారు పైరసీ కి మాత్రమే పాల్పడం కాకుండా ఇతర నేరాలకు కూడా పాల్పడుతున్నారు. వారు సమాజం ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు అన్నట్లుగా వెబ్ సిరీస్ లో చూపించబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.
వెబ్ సిరీస్ ట్రైలర్ పై తమిళ్ రాకర్స్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా వారి వెబ్ సైట్ లో ఈ విషయాన్ని ప్రస్థావించారు. తమిళ్ రాకర్స్ కు చెందిన వారికి సమాజంలో జరుగుతున్న నేరాలకు సంబంధం ఏంటి అన్నట్టుగా వారు ప్రశ్నించాడు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. తమిళ్ రాకర్స్ విషయాన్ని కొందరు కమర్షియల్ చేస్తున్నారా అనేది కూడా చర్చ జరుగుతోంది.
ఈ వెబ్ సిరీస్ లో సాహో విలన్ అరుణ్ విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ్ రాకర్స్ ఎక్కడ నుండి పని చేస్తుంది... అసలు దీనికి అంతం ఎలా అనే విషయాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించారా లేదా అనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అత్యంత గడ్డు పరిస్థితి ఎదురుకొంటున్న సమయంలో తమిళ్ రాకర్స్ పుండు మీద కారం అన్నట్లుగా ఉంది.
తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్ ను తమిళం లో రూపొందించారు. సోనీ లైవ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సర్వం సిద్దం అయ్యింది. గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ ను ఎంత వరకు ఆదరిస్తారు అనేది చూడాలి. తెలుగు వారిలో కూడా ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి కనిపిస్తోంది.