తమిళ సినీ ఇండస్ట్రీలో ఏఆర్ రహమాన్ తర్వాత ఆ స్థాయి సంగీత దర్శకుడిగా పేరు దక్కించుకున్న అనిరుద్ తాజాగా తమిళ ఆహా ఓటీటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఆహా తమిళ ప్రారంభోత్సవం సందర్బంగా పలువురు పలు రకాలుగా మాట్లాడుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగు లో ఎలా అయితే సూపర్ హిట్ ఓటీటీ గా ఆహా నిలిచిందో అలాగే తమిళ ఆహా కూడా నిలవాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా అనిరుధ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తమిళ ఓటీటీ ప్రారంభోత్సవం సందర్బంగా అనిరుధ్ మాట్లాడుతూ తెలుగు ఆహా ఓటీటీ కి సంబంధించిన షో లు నేను కొన్ని చూశాను. ముఖ్యంగా ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఎన్బీకే అన్ స్టాపబుల్ టాక్ షో కు సంబంధించిన ప్రోమోలను యూట్యూబ్ లో చూడటం జరిగింది. అవి చాలా బాగున్నాయి. ఆ షో మంచి హిట్ గా నిలిచింది. అలాగే తమిళంలో కూడా ఆహా ఓటీటీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనిరుధ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మన బాలయ్య టాక్ షో తమిళ ప్రేక్షకులు మరియు సెలబ్రెటీల వరకు చేరింది అంటే ఏ స్థాయిలో ఈ షో సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ టాక్ షో కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో త్వరలోనే సీజన్ 2 ను తీసుకు వస్తామంటూ ఇప్పటికే ఆహా ప్రకటించిన విషయం తెల్సిందే. తెలుగు లో ఆహా ఓటీటీ లో అత్యధిక రన్ టైమ్ వ్యూస్ ను దక్కించుకున్న షో గా బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ నిలిచింది.
అద్బుతమైన కంటెంట్ ను ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న వారు ఇప్పుడు తమిళ ఓటీటీ మొదలు పెట్టడం ద్వారా మరింత ఎంటర్ టైన్మెంట్ ను అందించేందుకు సిద్దం అవుతున్నారు. అక్కడ కూడా తెలుగు టీమ్ తరహాలోనే ఒక మంచి టీమ్ ను అల్లు అరవింద్ ఫామ్ చేశాడు. వారు తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ మరియు బెస్ట్ కంటెంట్ ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న సినిమాలు.. వెబ్ సిరీస్లు మాత్రమే కాకుండా అక్కడ కూడా టాక్ షో లు ఇతర షో లతో తమిళ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నారు.
బాలయ్య టాక్ షో తరహా లో అక్కడ కూడా స్టార్ హీరోతో ఒక టాక్ షో ను ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆహా కేవలం తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది.
వేరు వేరు భాషలకు వేరు వేరు ప్లాట్ ఫామ్స్ ఉండటం వల్ల ఎక్కువ శాతం ప్రేక్షకులు ఖాతాదారులుగా అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆహా ముందు ముందు మరింతగా ఎంటర్ టైన్మెంట్ ను అందించేలా ప్లాన్స్ చేస్తున్నట్లుగా అల్లు అరవింద్ తాజాగా ప్రకటించాడు.