ముందే టైమ్ ఫిక్స్ చేసి.. వార్నింగులు ఇచ్చి మరీ పైరసీలో సినిమాలను రిలీజ్ చేయడం తమిళ రాకర్స్ ప్రత్యేకత. తెలుగు-తమిళ రంగాల్లోని నిర్మాతలతో పాటు ఇతర సినీరంగాల్లోని నిర్మాతల కంటికి కునుకుపట్టనీకుండా చేసిన టెర్రిబుల్ మాఫియా ఇది. సినిమా రిలీజైన మొదటి రోజే పైరసీలో లింకుల్ని రిలీజ్ చేయడం.. మార్కెట్లో డీవీడీలను ప్రవేశ పెట్టడం తమిళ రాకర్స్ ప్రత్యేకత. ప్రతిదీ ముందే చెప్పి చేయడం వీళ్ల ప్రత్యేకత.
రెండు మూడు రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతగా ప్రయత్నించినా తమిళ రాకర్స్ ఆట కట్టించడంలో విఫలమయ్యారు. దీని వెనక అంతర్జాతీయ ముఠాలు ఉన్నాయని దేశ విదేశాల్లో తమిళ రాకర్స్ నెట్ వర్క్ పని చేస్తుందని కూడా టాక్ ఉంది. తమిళ రాకర్స్ గురించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించడం హాట్ టాపిక్ గా మారింది.
థియేటర్లలో మూవీ టికెట్ ధరలు పెరుగుతున్న క్రమంలో ఫ్యామిలీ ఆడియెన్ డీవీడీల్లో సినిమాలు చూడడం ప్రారంభించారు. కొత్త సినిమాల డీవీడీలను తమిళ రాకర్స్ నెట్ వర్క్ ద్వారా కొనుక్కునేవాళ్లు లేకపోలేదు. ఇక తమిళ రాకర్స్ తెలుగు-తమిళంలో అగ్ర హీరోల సినిమాలను నిమిషాల్లో ఆన్ లైన్ లో హెడ్.డి క్వాలిటీతో అప్ లోడ్ చేయడమే గాక డౌన్ లోడ్స్ కి అందుబాటులో ఉంచుతుండడంతో తీవ్రమైన నష్టాల్ని చూడాల్సి వస్తోంది.
తాజాగా రిలీజ్ చేసిన `తమిళ రాకర్జ్` సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. తమిళ్ రాకర్స్ ఆన్ లైన పైరసీతో మల్లగుల్లాలు పడే సినీపెద్దల నాటకీయ పరిణామాలు ట్రైలర్ లో ఉత్కంఠను పెంచాయి. 5.1 హెచ్ డి క్వాలిటీతో సినిమాల్ని రిలీజ్ చేస్తాం.. అంటూ తమిళ రాకర్జ్ వార్నింగులు ఇస్తుంటే రేయింబవళ్లు కష్టపడి తీసిన సినిమాని నాశనం చేస్తారా? అంటూ ఆవేదన ఆక్రోశం ఈ ట్రైలర్ లో వినిపించింది. ఇక మాఫియాకి ఎదురెళ్లే కాప్ పాత్రలో అరుణ్ విజయ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ మరో హైలైట్ గా కనిపించనుంది.
వీటన్నిటినీ మించి పవన్ కళ్యాణ్ సినిమా పైరసీ వెనుక ఎవరున్నారు? అనే విషయాన్ని కూడా ఈ ట్రైలర్ లో టచ్ చేయడం ఉత్కంఠను పెంచింది. ఆసక్తికరంగా పవన్ నటించిన అత్తారింటికి దారేది మూవీ పైరసీ లీక్ గురించి ఈ సిరీస్ లో ప్రస్థావించారా? అన్నది సస్పెన్స్ గా మారింది. `అత్తారింటికి దారేది` మూవీ రిలీజ్ ముందు సినిమాలో కొంత భాగాన్ని ఆన్ లైన్ లో లీక్ చేయడంతో అప్పట్లో నిర్మాత బివిఎస్.ఎన్ గుండెపోటుతో ఆస్పత్రిలోనూ చేరారు. అంతటి టెన్షన్ కి గురి చేసిన అంశాన్ని ఇప్పుడు తెరపై ఆవిష్కరిస్తున్నారని హింట్ అందింది.
నిజానికి `అత్తారింటికి దారేది` అని ప్రస్థావించకపోయినా కానీ పవన్ కల్యాణ్ మూవీ పైరసీ అంటూ డైలాగ్ ట్రైలర్ లో వినిపించడంతో వెంటనే పాత ఘటన అభిమానులకు స్ట్రైక్ అవుతోంది. చూస్తుంటే ఈ సిరీస్ తెలుగు-తమిళ ఇండస్ట్రీలతో పాటు అన్ని పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ కానుందని అర్థమవుతోంది. పైరసీ మాఫియాని పలు సినిమాల్లో పాక్షికంగా చూపించినా కానీ పూర్తి స్థాయిలో ఒక సిరీస్ రూపంలో చూపిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సిరీస్ రాక కోసం సినీపరిశ్రమ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 19 ఆగస్టు నుంచి సోని లివ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
Full View