తెలుగు స్పూఫ్ లనే టార్గెట్ చేశారే!

Update: 2018-07-07 06:46 GMT
అల్లరి నరేష్ సుడిగాడు గుర్తుందిగా. రకరకాల సూపర్ హిట్ సినిమాల స్పూఫ్ లతో  కథను అల్లేసి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ  అల్లరి నరేష్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. నిజానికి ఇది తమిళ్ లో వచ్చిన  తమిజ్ పదం రీమేక్. ఇప్పుడు తెలుగులో కాదు కానీ తమిళ్ లో దీనికి సీక్వెల్ రెడీ అయిపోయింది. అచ్చం మొదటి భాగం తరహాలో అన్ని స్పూఫ్ లతో నింపేసిన ఈ సినిమా పోస్టర్స్ కూడా అదే తరహాలో డిజైన్ చేస్తున్నారు. సెన్సార్ వాళ్ళు యు ఇచ్చిన విషయాన్ని  బాహుబలి తరహా పోస్టర్ లో తయారు చేసిన యూనిట్ ఆఖరికి మహానటిని కూడా పబ్లిసిటీకి వాడేసుకున్నారు. అలా అని అన్ని తెలుగు సినిమాలనే  టార్గెట్ చేయలేదు. సూపర్ హిట్ తమిళ సినిమాలన్నీ ఇందులో యథేచ్ఛగా వాడేసుకున్నారు. శివాజీ-ధృవ-అదిరింది-డిటెక్టివ్-తుపాకీ-గ్యాంబ్లర్ ఇలా ఏ సినిమానీ వదలకుండా స్పూఫ్ లతో సినిమా మొత్తం నింపేశారు.

దీనికి హీరో శివ. మనకు పరిచయం లేదు కానీ తమిళనాట కామెడీ స్టార్ గా  మంచి పేరుంది. సిఎస్ ఆముదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంగీతం కన్నన్. ఇందులో నిన్నటి  తరం హీరోయిన్ కస్తూరి హాట్ ఐటెం సాంగ్ చేయటం ఇప్పటికే కోలీవుడ్ సంచలనంగా మారింది. ఇది తెలుగులో డబ్ కాకపోవచ్చు. ఒకవేళ హిట్ అయితే సుడిగాడు 2 పేరుతో రీమేక్ చేసే అవకాశాలు కొట్టి పారేయలేం. ఈ మధ్య స్పూఫ్ లకు అంతగా ఆదరణ దక్కడం లేదు. కానీ తమిజ్ పదం 2 నిర్మాతలు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్టు టీజర్ లో ఆద్యంతం నవ్వుకునే విషయాలు చాలా ఉన్నాయి అనే తరహాలో ఇంప్రెషన్ ఇవ్వడంతో బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. తెలుగులో కూడా తీస్తే బాగానే ఉంటుంది కానీ మరి అల్లరి నరేష్ ఒప్పుకుంటాడా లేదా అనేది తమిళ్ వెర్షన్ విడులయ్యాక దాని ఫలితాన్ని బట్టి ఉంటుంది.
Tags:    

Similar News