'జార్జ్‌ రెడ్డి' లో అసలు కంటే కొసరే ఎక్కువ ఉంది

Update: 2019-11-25 06:51 GMT
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు జార్జ్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'జార్జ్‌ రెడ్డి'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ఈ చిత్రం గురించి జార్జ్‌ రెడ్డికి సన్నిహితుడు అయిన ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. జార్జ్‌ రెడ్డి సినిమాలో అసలు కంటే కల్పితం ఎక్కువ ఉందని.. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసం చాలా మార్చారంటూ తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. జార్జ్‌ రెడ్డి అసలు హాస్టల్‌ లో ఉండేవాడు కాదు. యూనివర్శిటీ పక్కన రూంలో ఉన్నాడు. జార్జ్‌ రెడ్డి అసలు గొడవలకు వెళ్లేందుకు ఇష్టపడేవాడు కాదు. ఎక్కువ చదువుపై దృష్టి పెట్టేవాడు. చదువు పై ఉన్న ఆసక్తి తో తోటి విద్యార్థుల కు కూడా చదువు చెప్పేవాడు. అన్ని సబ్జెక్ట్స్‌ ను కూడా చాలా డెప్త్‌ గా వివరించేవాడు. జార్జ్‌ అంత ఆవేశ పరుడు ఏమీ కాదు. అతడు బతికి ఉంటే ఖచ్చితం గా దేశానికి గొప్ప నాయకుడి గా అయ్యేవాడు అంటూ చెప్పుకొచ్చాడు.

జార్జ్‌ రెడ్డి సినిమా తీస్తున్న సమయం లో నేను ఒకసారి సెట్స్‌ కు వెళ్లాను. అక్కడ ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్‌ కాలేజ్‌ సెట్‌ వేయడం చూశాను. అసలు జార్జ్‌ రెడ్డికి ఆర్ట్స్‌ కాలేజ్‌ కు సంబంధం లేదు. అయినా ఆ సెట్‌ లోనే ఎక్కువగా చిత్రీకరణ చేస్తున్నట్లుగా చెప్పడంతో నాకు అప్పుడే సినిమా కమర్షియల్‌ యాంగిల్‌ లో తీస్తున్నట్లుగా అర్థం అయ్యింది. జార్జ్‌ రెడ్డి పేరు ఉస్మానియా యూనివర్శిటీ నేపథ్యం వాడుకున్నారు తప్ప ఒరిజినల్‌ జార్జ్‌ రెడ్డి కథ కు ఈ సినిమా కు చాలా వ్యత్యాసం ఉందని తమ్మారెడ్డి అన్నారు. బయోపిక్‌ అంటూ అసలు కంటే కొసరు ఎక్కువ తీశారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News