ఆ పదవికి చిరు అర్హుడు కాదా?

Update: 2020-02-07 10:39 GMT
మెగాస్టార్ చిరంజీవికి నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రభుత్వం అప్పగిస్తుందన్న వార్తల నేపథ్యంలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ పదవికి చిరంజీవి అర్హుడు కాదు అంటూ వ్యాఖ్యానించారు.

తమ్మారెడ్డి మాట్టాడుతూ.. చిరంజీవికి నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని.. ఆయనకు ఇవ్వడం వద్దే వద్దని స్పష్టం చేశారు. ఎందుకంటే చిరంజీవికి ఉన్న స్థాయికి ఆ గౌరవం సరిపోదని.. కమిటీ చైర్మన్ అయితే అవార్డులు ప్రకటిస్తే గొడవ చేసి ఆయన పరువు తీస్తారని.. పనీ పాటా లేనోళ్ల కు  నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని సూచించారు. చిరంజీవికి ఇస్తే తాను ఆయనతో గొడవపడి మరీ తీయించేస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ కు సమస్యలు వస్తే చిరంజీవి ముందుంటారని.. పైగా సినిమాలతో బిజీగా మారారని అనవసరంగా ఈ అవార్డుల లొల్లిలోకి ఆయనను లాగవద్దని తమ్మారెడ్డి హితవు పలికారు.

 చిరంజీవి, నాగార్జున ఇటీవలే మంత్రి తలసాని శ్రీనివాస్ ను కలవడం.. కీలక సమావేశం నిర్వహించడం.. చిరంజీవిని నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ గా నియమిస్తారనే వార్త బయటకు రావడంపై తమ్మారెడ్డి ఈ విధంగా కామెంట్స్ చేశారు. చిరంజీవికి నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వడం మంచి నిర్ణయం కాదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.


Tags:    

Similar News