సుడోకు మూర్తి సూపర్ అంటున్నాడుగా..

Update: 2016-06-01 15:30 GMT
సీనియర్ కేరక్టర్ నటుడు తనికెళ్ల భరణి. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఒకటే కేరక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఈయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు, పాత్రలు చాలానే ఉన్నా.. ప్రస్తుతం తను చేస్తున్న ఓ సినిమాలోని పాత్ర... తన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోతుందని చెబుతుండడం విశేషం. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో జ్యో అచ్యుతానంద చిత్రంలో నటిస్తున్నాడు తనికెళ్ల భరణి. ఈ మూవీలో భరణి పాత్ర పేరు సుడోకు మూర్తి.

అవసరాలకు - తనికెళ్లకు పర్సనల్ గా కూడా మంచి రాపో ఉందని అంటారు. అలా సన్నిహితంగా ఉండడం.. ఇప్పుడు సినిమా విషయంలో కూడా బాగా వర్కవుట్ అవుతోందట. అలాగే సుడోకు మూర్తిగా తను పండించే కామెడీ.. చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు భరణి. సహజంగానే ఈయన కామెడీని చక్కని టైమింగ్ తో పండించగల ట్యాలెంట్ ఉన్నవాడు. మరోవైపు శ్రీనివాస్ అవసరాల కూడా మంచి కామెడీ టైమింగ్ తో సినిమాలు తీస్తుంటాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో జ్యో అచ్యుతానంద మూవీ వస్తుండగా.. ఇందులో తన రోల్ కెరీర్ లోనే తను చేసిన మంచి పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుందని తనికెళ్ల చెబుతున్నారు.

సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కళ్యాణ్ కోడూరి మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరపుకుంటున్న జ్యో అచ్యుతానంద.. మరో మూడు నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసుకోనుందని తెలుస్తోంది.
Tags:    

Similar News