కుర్రాడు స్టైలిష్ విలన్ గా మారాడు

Update: 2017-01-03 07:30 GMT
చైల్డ్ యాక్టర్ స్థాయి నుంచి కుర్రహీరో వరకూ ఎదిగి కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు తనీష్. చెప్పుకోదగిన స్థాయిలోనే సినిమాల్లో కనిపించినా.. యూత్ ను ఆకట్టుకునే టైపు మూవీస్ చేసినా.. తనీష్ కి ఇంకా సరైన సినిమా పడలేదు. వరుసగా ఆఫర్స్ వచ్చి పడిపోయే కేరక్టర్స్ ఏమీ రాలేదు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తనీష్ ఫేట్ ని మార్చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు.

నక్షత్రం మూవీలో ఇద్దరు కుర్ర హీరోలు చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరో కాగా.. సాయిధరం తేజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరికి విలన్ గా తనీష్ తో చేయిస్తున్నాడట కృష్ణవంశీ. స్టైలింగ్ అంతా మార్చేసి.. డిఫరెండ్ గా గెడ్డం పెంచేసి.. హెయిర్ స్టైల్ ని కూడా కొత్తగా చూపిస్తూ.. తనీష్ లుక్ కంప్లీట్ గా మార్చేశాడు. నక్షత్రం మూవీలో ఇతను స్టైలిష్ విలన్ పాత్ర పోషిస్తున్నాడట. హీరో పాత్రలతో ఆకట్టుకోలేకపోయినా.. ఏకంగా ఇప్పటి ట్రెండ్ అయిన స్టైలిష్ యంగ్ విలన్ రోల్ చేయడం అంటే సాహసం కిందే చెప్పాలి.

ఇతర భాషల హీరోలను ఇక్కడ విలన్స్ గా చూపించే ప్రయత్నాలను చాలా మంది డైరెక్టర్లే చేశారు కానీ.. కృష్ణవంశీ మాత్రం క్రియేటివ్ గా మన హీరోనే మనకు విలన్ గా చూపించబోతున్నాడు. హీరోగా అభిమానులను అలరించడంలో విఫలమైన తనీష్ కెరీర్.. విలన్ రూట్ లో ఎలాంటి టర్న్ తీసుకోనుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News