నార్కో టెస్టులు అంటూ నానా ర‌చ్చ‌

Update: 2018-10-14 13:18 GMT
నానా ప‌టేక‌ర్ - త‌నూశ్రీ ద‌త్తా వివాదం బాలీవుడ్ స‌హా దేశాన్ని దావాన‌లంలా చుట్టేసిన సంగ‌తి తెలిసిందే. మీ టూ ఇండియా ఉద్య‌మం అంత‌కంత‌కు కొత్త జాబితాని ప్రిపేర్ చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు టాప్ డైరెక్ట‌ర్స్, న‌టుల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కొంద‌రు న‌టీమ‌ణులు త‌మ‌పై జ‌రిగిన దురాగ‌తాల్ని బ‌య‌ట‌పెట్టి, పేర్ల‌ను రివీల్ చేస్తున్నారు.

త‌నూశ్రీ వివాదం అంత‌కంత‌కు ముదిరిపాకాన ప‌డుతోంది. ముంబై ఓశివ‌రా పోలీస్ స్టేష‌న్‌లో నానా ప‌టేక‌ర్ - కొరియోగ్రాఫ‌ర్‌ గ‌ణేష్ ఆచార్య‌ - ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.... స‌మీ సిద్ధీఖి - రాకేష్ సారంగ్ త‌దిత‌రుల‌పై త‌నూశ్రీ ద‌త్తా ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. వీళ్లంతా త‌న‌పై దాడి చేశార‌ని, నానా లైంగికంగా వేధించార‌ని త‌నూశ్రీ ఆరోపించింది. దీంతో ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసులు న‌మోదు చేసి విచారిస్తున్నారు. ఈ త‌ర‌హా కేసులు విచారించేందుకు కేంద్ర మంత్రుల స్థాయిలో ఓ బృందం బ‌రిలో దిగ‌డంతో స‌మ‌స్య చాలా సీరియ‌స్ అవుతోంది.

తాజాగా నానా పై నార్కోటిక్ టెస్టులు చేయాల‌ని, లై డిటెక్ట‌ర్‌తో అత‌డు చెప్పే అబ‌ద్ధాల గ్రాఫ్‌ని ప‌రిశీలించాల‌ని పోలీసుల‌కు సుదీర్ఘ‌మైన లేఖ రాసింది త‌నూశ్రీ ద‌త్తా. త‌న‌కు ఉన్న రాజ‌కీయ ప‌రిచ‌యాల ద్వారా కేసును త‌ప్పుదోవ ప‌ట్టించే అవ‌కాశం ఉంద‌ని, సాక్ష్యాలు తారుమారు అవుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది లేఖ‌లో. ప్ర‌త్య‌క్ష సాక్ష్యులను సాక్ష్యం చెప్ప‌నీయ‌కుండా నిలువరించే అవ‌కాశం ఉంద‌ని త‌నూశ్రీ నివేదించింది. మొత్తానిని నానా ప‌టేక‌ర్ ఈ వివాదం నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డే అవ‌కాశ‌మే లేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.
Tags:    

Similar News