బాలకృష్ణ నటించిన 'వీరభద్ర' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మిస్ ఇండియా తనుశ్రీ దత్తా. బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకుడితో కలిసి నటించినా తెలుగులో ఆఫర్స్ మాత్రం రాలేదు. అయితే అప్పట్లో 'మీటూ' ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇండియన్ సినీ ఇండస్ట్రీని కుదిపేసిన 'మీటూ' ఉద్యమానికి హీరోయిన్ తనుశ్రీ దత్తా ముందుగా ఆజ్యం పోసింది. నానా పటేకర్ లాంటి లెజెండరీ యాక్టర్ మీద లైంగిక ఆరోపణలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది తనుశ్రీ.
అయితే దీనిపై నానా మాత్రం ఎప్పుడూ అసత్యమే అని కొట్టి పారేస్తూ వచ్చాడు. బాలీవుడ్ ఒక్కటే కాదు - ఇండియన్ సినిమాను కూడా కుదిపేసిన ఘటన ఇది. పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సెట్స్ లో తనను నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెలిసిందే. నానా పటేకర్‌పై కేస్ కూడా నమోదైంది. అయితే నానా పటేకర్ తప్పు చేసాడని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు తేల్చేసింది. దాంతో కొన్నాళ్ళు కోర్టులో నడిచిన ఈ కేసు నుంచి నానా పటేకర్ విముక్తి పొందాడు. ఈ ఘటన తర్వాత తనుశ్రీ మానసికంగా ఆర్థికంగా కుంగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చిన ఈ భామ తను కృంగిపోవడానికి కారణమైన ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకుంటానంటూ శపథం చేసిందంట. అలాగే తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో అండగా ఉంటానంటూ ప్రతీజ్ఞ తీసుకుందని బీటౌన్ లో మాట్లాడుకుంటున్నారు.