వివాదాలతో వేడి పెంచడం బిగ్ బాస్ స్టైల్. హీటెక్కించనిదే ప్రేక్షకులను టీవీల ముందుకు రప్పించడం ఈ రోజుల్లో కష్టం. సినిమా థియేటర్లు ఓటీటీల నుంచి జనం దృష్టిని మరల్చి బుల్లి తెరకు అంకితం చేయడం అంటే శ్రమించాల్సొస్తోంది. కానీ బిగ్ బాస్ ఫార్ములా దీనికి అతీతం. ఇతర రియాలిటీ షోలతో పోలిస్తే ఈ షో పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం నిరంతర వివాదాలే. వివాదాలతో ప్రచారం కొట్టేయడమెలానో షో నిర్వాహకులు చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్ షోలో వివాదాస్పదులందరినీ ఒకే గొడుగు కిందికి తేవడం ద్వారా షో ప్రారంభానికి ముందే నానా రచ్చవుతుంటుంది. కావాల్సినంత ప్రీపబ్లిసిటీని ఈజీగా కొట్టేయడానికి ఇది అద్భుతమైన ఫార్ములా అని ప్రూవైంది. బిగ్ బాస్ హిందీ విజయానికి మూల సూత్రమేమిటో ఇప్పుడు ప్రజలకు కూడా తెలుసు.
ఇటీవల ఆరంభ దశలోనే బిగ్ బాస్ 16 (హిందీ) అగ్గిరాజేస్తోంది. #MeToo నిందితుడైన ప్రముఖ దర్శకనిర్మాత సాజిద్ ఖాన్ ని ఈ రియాలిటీ షోకి ఎంపిక చేయడంతో సల్మాన్ సహా నిర్వాహకులు తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. వేధింపుల మాన్ స్టర్ ని బిగ్ బాస్ ఇంట్లోకి లాగుతారా? అంటూ గుస్సా ఒక రేంజులో కొనసాగుతోంది. ఇంతకుముందే బిగ్ బాస్ పార్టిసిపెంట్ షెర్లిన్ చోప్రా సాజిద్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా సెట్లో చూపించకూడనిదేదో తనకు చూపించి రేటింగ్ ఇవ్వమన్నాడంటూ ఒక్కసారిగా అగ్గి రాజేసింది. ఆ తర్వాతా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. వివాదాస్పదులు విధివంచితలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభ దశలోనే ప్రచారఫర్వంలో పరాకాష్టకు చేర్చడంలో ఎవరి విధిని వారు నిర్వర్తిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్న రియాలిటీ షోలో సాజిద్ ఖాన్ పాల్గొనడంపై #MeToo క్వీన్ తనుశ్రీ దత్తా ఎట్టకేలకు మౌనం వీడింది. బిగ్ బాస్ 16 మునుపటి సీజన్ల మాదిరిగానే ఆశ్చర్యకరమైన వింతైన వివాదాలతో దుమ్ము రేపుతోంది. ఈ రియాల్టీ షోలో వేధింపుల నిందితుడు సాజిద్ ఖాన్ పాల్గొనడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ సీజన్ లో హౌస్ ఫుల్ డైరెక్టర్ సాజిద్ ఎంట్రీపై నెటిజనులు సెలబ్రిటీల్లోని ఒక వర్గం నిర్వాహకులపై చెలరేగుతున్నారు.
ఉర్ఫీ జావేద్- షెర్లిన్ చోప్రా - మందనా కరిమి వంటి హాట్ గాళ్స్ ఇప్పటికే సాజిద్ ఎంపికపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు తనుశ్రీ దత్తా BB16లో సాజిద్ పాల్గొనడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెలబ్రిటీ రియాలిటీ షోలో పోటీదారులలో వివాదాస్పద దర్శకనిర్మాత సాజిద్ కూడా ఉన్నారని తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని తాజా ఇంటర్వ్యూలో తనూశ్రీ చెప్పింది.
ఈసారి సీజన్ లో సాజిద్ ఖాన్ పాల్గొనడం చాలా బాధ్యతారహితమైన చర్య అని తనుశ్రీ దత్తా విమర్శించారు. ప్రముఖ మీడియాతో ఇంటరాక్షన్ లో తనుశ్రీ స్పందిస్తూ-``నేను కూడా భయపడిపోయాను. ఇది పూర్తి బాధ్యతారాహిత్యం.. ఈ ఎంపిక ప్రజలపై చూపే ప్రభావాన్ని చూసి నేను నోరు మెదపలేను. నేను బిగ్ బాస్ ని చూడను. దీని తర్వాత ఎప్పటికైనా చూస్తానని అనుకుంటున్నాను`` అని వ్యాఖ్యానించారు.
`హార్న్ ఓకే ప్లీజ్` సెట్స్ లో తనకు అసౌకర్యం కలిగించినందుకు సీనియర్ నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు చేయడంతో తనుశ్రీ ఆయన అభిమాన వర్గం నుంచి.. పరిశ్రమ నుంచి చాలా వ్యతిరేకతను చవిచూడాల్సి వచ్చింది. ``లైంగిక వేధింపుల గురించి భారతదేశంలో నిశ్శబ్దం .. గోప్యత ఇంకా కొనసాగుతోంది. ఈ సంస్కృతిని బట్టి #MeToo ఉద్యమం భారతదేశంలో ఒక గుర్తింపు లేని దృగ్విషయం. ఒక ఆధునిక భారతీయ అమెరికన్ అమ్మాయిని అయినందున కుళ్ళిపోయిన ఈ వ్యవస్థలో ఈ రకమైన నిశ్శబ్ధాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకోవడం నాకు ఎప్పుడూ కష్టమే. నా ఉద్దేశ్యం చెడు ప్రవర్తనకు పాల్పడినవారు శిక్షించబడినప్పుడు మాత్రమే సమాజం సురక్షితంగా ఉంటుంది`` అని ఎమోషనల్ గా వ్యాఖ్యానించింది తనూశ్రీ. లైంగిక వేధింపుల వేటగాళ్లను షోలోకి పిలవడం వెనక ఉన్న కళంకంపై తనుశ్రీ ఘాటుగా స్పందించింది.
ఇలాంటి వేటగాళ్లను షోలోకి ఆహ్వానించడం చూశాక.. వాస్తవిక సమాజంలో ఇంతటి కళంకం ఉండడం సహజం అనిపించింది. ఇది నాకు వింతగా అనిపిస్తోందని తనుశ్రీ పేర్కొంది. మీ ఇంటిని ఎవరైనా దోచుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. ఇది సరియైనదే కదా? ఎవరైనా మీ గౌరవాన్ని దెబ్బతీస్తే లేదా వారి సుఖాల కోసం మిమ్మల్ని మోసపూరితంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఎందుకు ఫిర్యాదు చేయకూడదు? ప్రజలు నన్ను అమెరికన్ ని అని అనుకుంటారు. కానీ నేను భారతీయ మహిళగా నా గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాను.. అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మహిళా కమీషన్ చీఫ్ కి రేప్ బెదిరింపులు..
సాజిద్ #MeToo నిందితుడు కాబట్టి బిగ్ బాస్ 16 నుండి అతన్ని ఎలిమినేట్ చేయాలని ఇటీవల ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు కూడా ఆమె లేఖ రాశారు. MeToo ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకనిర్మాతపై మాట్లాడినందుకు ఇటీవల ఆమెకు ఆన్ లైన్ లో రేప్ బెదిరింపులు ఎదురవ్వడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ 16 వారం రోజులలో రాత్రి 10 గంటలకు కలర్స్ లో అలాగే వూట్ లో ప్రసారం అవుతుంది. సల్మాన్ ఖాన్ తో వీకెండ్ కా వార్ రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.