రెండేళ్ల కిందట మిస్ ఇండియా ఫైనలిస్టు అయి.. గత ఏడాది తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేసిన అమ్మాయి తన్య హోప్. మిల్కీ బ్యూటీ తమన్నా పోలికలతో ఉండే తన్య ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా నటించి పర్వాలేదనిపించింది. ఐతే ఆ సినిమా తర్వాత తన్యాకు పెద్దగా అవకాశాలేమీ రాలేదు. ఇప్పుడామె జగపతిబాబు కథానాయకుడిగా నటించిన ‘పటేల్ సార్’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇందులో ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేస్తోంది. తొలి సినిమాలో మాదిరి ఇందులో తనది గ్లామర్ రోల్ కాదని.. సీరియస్ గా కనిపిస్తానని.. తనలోని మరో కోణం చూస్తారని ఆమె అంటోంది. ఈ సినిమా చేస్తూ తాను చాలా నేర్చుకున్నానని చెబుతోంది.
ఈ సినిమాలో తన పాత్ర చేయడానికి ముందు దర్శకుడు వాసు పరిమి తనకు ‘జనతా గ్యారేజ్’ సినిమా చూడమని చెప్పినట్లు తన్య వెల్లడించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్.. ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో గమనించమని.. అది గమనిస్తే ఏ పాత్ర అయినా బాగా చేయొచ్చని దర్శకుడు చెప్పాడని తన్య తెలిపింది. పర్ఫెక్షన్ కోసం ఆ సినిమా చూసినట్లు ఆమె చెప్పింది. ‘పటేల్ సార్’లో తనకు పాటలేమీ ఉండవని.. హీరో చేసే హత్యల్ని ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో సీరియస్ గా కనిపిస్తానని తన్య తెలిపింది. ఈ అందాల భామ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వెల్లడించింది. పాలిటిక్స్ అంటే తనకు ముందు నుంచి ఆసక్తి ఉందని.. అందుకే నటిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది.