ముంబైలోని తన ఇండ్లు ఆస్తులపై ఐటీ శాఖ దాడుల నేపథ్యంలో తాప్సీ పన్ను పేరు మీడియాలో మార్మోగిన సంగతి తెలిసిందే. తన కొలీగ్ అనురాగ్ బసు- తాప్సీ ఆస్తులన్నిటిపైనా జరిగిన వాస్తవిక పన్ను చెల్లింపు శోధనలో 650 కోట్లకు సంబంధించిన అవకతవకలు బయటపడ్డాయని మీడియాలో కథనాలొచ్చాయి. వీటికి సంబంధించిన నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఐటీ అధికారులు బరిలో దిగడం కలకలం రేపింది.
అయితే ఈ దాడులపై కొద్ది రోజులుగా కథనాలొస్తున్నా.. దానిపై స్పందించడానికి తాప్సీ మీడియా ముందుకు రాలేదు. కానీ తన ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించడం హీట్ పుట్టిస్తోంది. మూడురోజుల శోధనలో మూడు విషయాలు అంటూ వివరణ ఇస్తూ.. పారిస్ లో నా సొంత బంగ్లా..రానున్న వేసవి సెలవుల కోసం.. అలాగే భవిష్యత్ 5కోట్ల రశీదులు..నేను వద్దనుకున్న సొమ్ములు.. అంటూ తాప్సీ ఏదో చెప్పాలని చూశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పైనా పంచ్ లు వేస్తూ.. 2013 లో కూడా ఐటీ శాఖ తనపై దాడులు నిర్వహించిందని గౌరవనీయ కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. మా గౌరవనీయ ఆర్థిక మంత్రి .. నాపై 2013 దాడి గుర్తుంది.. ఇకపై శాస్తీ కాదు`` అని తాప్సీ వ్యంగ్యంగా అన్నారు. ఈ కామెంట్లు అన్నీ పరిశీలిస్తే.. తాప్సీ ఎటువంటి పన్ను ఎగవేతకు పాల్పడలేదని స్పష్టం చేసినట్టే అనుకోవాలి. కానీ ఇందులో నిజానిజాల్ని ఐటీ శాఖ నిర్ధారిస్తుంది.