సినీపరిశ్రమలు మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలుగానే ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. హీరోలు దర్శకులే ఇక్కడ రాజ్యమేలుతుంటారు. నిర్మాతను ఫైనాన్షియర్ ని చేశారు. ఇక కథానాయికల పరిస్థితి చెప్పాల్సిందేముంది? నాయికల గౌరవ మర్యాదలు సహా పారితోషికాల విషయంలోనూ బోలెడన్ని విమర్శలున్నాయి.
ఈ పరిస్థితిపై నేరుగానే కౌంటర్లు వేస్తారు తాప్సీ పన్ను. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ని సమర్థిస్తూ తాప్సీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీని వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది. ఓ బాలీవుడ్ చిత్రంలో సీత పాత్రను పోషించడానికి 12 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిన కరీన్ కపూర్ అప్పట్లో పరిశ్రమకు షాక్ ఇచ్చారు.
పారితోషికం విషయంలో కరీనాకు తాప్సీ మద్దతుగా నిలిచింది. కరీనా మన దేశంలో సూపర్ స్టార్ లలో ఒకరు. తన విలువైన సమయం కేటాయించినందుకు కొంత జీతం అడగడం ఆమె పని..! అంటూ సమర్థించారు తాప్సీ.
ఒక మగ నటుడు తన ఫీజును పెంచినప్పుడు ఎవరికీ ఎటువంటి సమస్య లేదు.. అభ్యంతరాలు లేవు.. కానీ ఒక హీరోయిన్ అలా చేసేటప్పుడు ఎందుకు అంత రచ్చ చేస్తారు? అనేది నాకు అర్థం కావడం లేదు.. అని తాప్సీ వ్యాఖ్యానించారు. తాప్సీ తదుపరి హసీనా దిల్ రుబా అనే చిత్రంలో కనిపించనుంది. పలు నాయికా ప్రధాన చిత్రాలకు.. బయోపిక్ లకు తాప్సీ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.