టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పారితోషికం కోటి నుండి రెండు కోట్ల వరకు ఉంటుంది. ఒకరు ఇద్దరిది రెండు కోట్లకు మించి కూడా ఉంటుంది. కాని బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపిక పదుకునే.. ఆలియా భట్.. కంగనా రనౌత్.. ప్రియాంక చోప్రా.. కరీనా కపూర్ ఖాన్ వంటి వారి పారితోషికం మాత్రం ఏకంగా 5 నుండి 10 కోట్లు అంతకు మించి కూడా ఉంటాయి. బాలీవుడ్ హీరోయిన్ కు దక్కుతున్న పారితోషికం లో కనీసం సగం కూడా తమకు దక్కడం లేదు అంటూ సౌత్ హీరోయిన్స్ అప్పుడప్పుడు ఆదేన వ్యక్తం చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో పదేళ్ల క్రితం మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాధం సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సి ఆ తర్వాత తెలుగు లో పలు సినిమా ల్లో నటించింది. ఆ తర్వాత కాలం కలిసి రాక పోవడంతో ఆమె మూడు నాలుగు ఏళ్లకే టాలీవుడ్ లో ఆఫర్లు లేకుండా పోయాయి.
సౌత్ లో ఆఫర్లు లేని సమయంలో ఈ అమ్మడు మెల్లగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈమె పారితోషికం కోటి లోపే ఉండేది. ఇప్పుడు ఆమె పలు సక్సెస్ లను దక్కించుకుంది. ముఖ్యంగా ఈమె చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఏకంగా జాతీయ అవార్డులను కూడా దక్కించుకున్న సినిమా ల్లో నటించిన తాప్సి కి దక్కుతున్న పారితోషికం మరీ దారుణం అంటూ కొందరు అంటున్నారు. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె 2020 కి ముందు వరకు కూడా కోటి అంతకు తక్కువ పారితోషికం తోనే సినిమాను చేసింది. ఈమద్య ఆమె పారితోషికం కోటి నుండి రెండు కోట్ల మద్య ఉందని అంటున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తో నటించి మెప్పించడం మాత్రమే కాకుండా జాతీయ అవార్డు రేంజ్ నటన కనబర్చగల రేంజ్ ఆమెది. అయినా కూడా ఆమెకు దక్కుతున్న పారితోషికం మాత్రం నామమాత్రమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమద్య సౌత్ లో స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న పూజా హెగ్డే.. రష్మిక మందన్నా వంటి హీరోయిన్స్ కు రెండు మూడు కోట్ల పారితోషికం కూడా దక్కుతుంది. నయనతార కు ఏకంగా నాలుగు అయిదు కోట్ల వరకు పారితోషికంగా దక్కుతుంది. అలాంటిది తాప్సి మాత్రం రెండు కోట్ల పారితోషికం తీసుకోవడం ఏంటంటూ మీడియా సర్కిల్స్ లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మీడియా వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు తాప్సి ఇటీవల కమిట్ అయిన సినిమాకు రెండున్నర కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని.. ఆ పారితోషికంకు నిర్మాత నో చెప్పాడని.. రెండు కోట్ల వరకు అయితే ఓకే అన్నట్లుగా సమాచారం వినిపిస్తుంది. బాలీవుడ్ లో వరుసగా దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్స్ కు సరసన నిలిచే సత్తా ఉన్న హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న తాప్సి పారితోషికం విషయంలో మాత్రం కనీసం సౌత్ హీరోయిన్స్ రేంజ్ ను కూడా చేరుకోలేక పోతుంది. అందుకే తాప్సి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అనే పేరు ఉండి పారితోషికం తక్కువ ఉండటం వల్ల పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత గుర్తుకు వస్తుంది. ముందు ముందు అయినా తాప్సి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం తీసుకోవాలని సగటు తాప్సి ఫ్యాన్ కోరుకుంటున్నాడు.