ఢిల్లీ బేబీ తాప్సీ పన్ను ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ లో వెలిగిపోతోంది. వరుస ఆఫర్లు వస్తున్నా చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. కెరీర్ విషయంలో గతంలో చేసిన పొరపాట్లను చేయకుండా జాగ్రత్త పడుతోంది. అంతే కాదు.. ప్రముఖ బ్యానర్లలో తను నటిస్తోందన్న వార్తలు అబద్ధాలంటూ చెప్పేసి ఆశ్చర్యం కూడా కలిగించింది. ప్రస్తుతం రాణాతో ఘాజీలో నటిస్తున్న తాప్సీ.. ఇప్పుడో క్రేజీ ప్రాజెక్టును కూడా షూటింగ్ స్టార్ట్ చేసింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ 'ఈవ్'. ఈ సినిమాలో ఢిల్లీ బేబీ తాప్సీ పన్ను కూడా నటిస్తోంది. షూజిత్ సర్కార్ నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రముఖ బెంగాలీ దర్శకుడు అనిరుధ్ రాయ్ డైరక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఇక్కడ బుద్ధిగా కూచుని కనిపిస్తున్న తాప్సీ ఫోటో.. ఆ సినిమా షాట్ గ్యాప్ లో తీసినదే. షార్ట్స్ వేసుకుని - ఫుల్ స్లీవ్ షర్ట్ - తన కర్లీ హెయిర్ తో డిఫరెంట్ కనిపిస్తోంది తాప్సీ పన్ను.
ఈవ్ ను విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఓ అమ్మాయికి - ఆమె తాతకు మధ్య నడిచే ఎఫైర్ చుట్టూరా ఈవ్ స్టోరీ నడుస్తుందట. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను మెగాస్టార్ అమితాబ్ ఏ రేంజ్ లో ఇరగదీస్తారో మనకి తెలుసు. ఈ సినిమా ద్వారా బిగ్ బీ తనకు బిగ్ బ్రేక్ ఇస్తారని తాప్సీ హోప్స్ పెట్టుకుంది.