టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సీ పన్నూ.. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న తాప్సీ.. ''మిషన్ ఇంపాజిబుల్'' (Mishan Impossible) సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
'మిషన్ ఇంపాజిబుల్' చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం మలయాళ విలక్షణ నటుడు హరీశ్ పేరడీ ని ఎంపిక చేశారు.
మలయాళ చిత్రసీమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన హరీష్ పేరడీ.. 'ఖైదీ' 'స్పైడర్' 'మన్యం పులి' 'దొంగ' 'అదిరింది' 'విక్రమ్ వేద' 'మడ్డి' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు తెలుగులో ''మిషన్ ఇంపాజిబుల్'' సినిమాలో మరో స్పెషల్ క్యారక్టర్ ప్లే చేస్తున్నారు హరీశ్. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. దీపక్ యారగర సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.