సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి ప్రస్తుతం నార్త్ లో దూసుకు పోతుంది. చాలా తక్కువ మందికి హీరోయిన్స్ కు దక్కే అవకాశాలు ఈమెకు దక్కుతున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలు చేస్తూ అమ్మడు కెరీర్ లో ముందుకు సాగుతుంది. కమర్షియల్ సినిమాల కంటే లేడీ ఓరియంటెడ్... కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాల్లో ఈమెకు ఎక్కువగా ఛాన్స్ వస్తున్నాయి. సినిమాల్లో బిజీగా ఉన్న ఈ సమయంలోనే ఈ అమ్మడు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తుంది. నెటిజన్స్ విమర్శలను కూడా ఎదుర్కొంటుంది.
కొన్ని రోజుల క్రితం ఈమె బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. అమితాబచ్చన్ బాద్లా చిత్రంలో ఈమె కూడా నటించింది. అయితే ఆ సినిమా క్రెడిట్ పూర్తిగా అమితాబచ్చన్ కే దక్కిందని.. నేను కూడా ఆసినిమాలో నటించగా నాకు మాత్రం క్రెడిట్ ఇవ్వలేదంటూ తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో బచ్చన్ అభిమానులు చాలా మంది అప్పుడు తాప్సిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా తాప్సిపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.
బాద్లా వ్యాఖ్యలపై తాజాగా తాప్సి స్పందించింది. ఈమె నటించిన ‘తప్పడ్’ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను అమితాబచ్చన్ గారిని వ్యక్తిగతంగా అస్సలు విమర్శించలేదు. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. కాని ఆ సినిమాలో నేను కూడా చాలా కీలక పాత్ర పోషించాను.. నా పాత్ర నిడివి అమితాబ్ గారి పాత్ర నిడివితో సమానంగా ఉంది. అయినా కూడా నాకు గుర్తింపు రాలేదు అనే ఉద్దేశ్యం తో మాట్లాడాను తప్ప అంతకు మించి ఏమీ లేదంటూ తాప్సి చెప్పుకొచ్చింది. ప్రాధాన్యం గల పాత్రలో నటించినప్పుడు ప్రమోషన్స్ లో కూడా ప్రాముఖ్యత ఇచ్చి పోస్టర్స్ లో ఫొటోలు వేస్తే ఆ నటి లేదా నటుడికి సంతోషం అంది.