పెళ్లి కండీష‌న్లు బోయ్ ఫ్రెండ్ విన్నారా తాప్సీ?

Update: 2021-07-09 06:30 GMT
బాలీవుడ్ లో రెబ‌ల్ క్వీన్ గా పాపుల‌రైన తాప్సీ ప‌న్ను తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ .. తాను పెళ్లాడ‌బోయే యువ‌కుడు ఎలా ఉండాలో క్లియ‌ర్ క‌ట్ గా చెప్పుకొచ్చింది. తాను పెళ్లాడాలంటే ఆ యువ‌కుడు క‌చ్ఛితంగా త‌న త‌ల్లిదండ్రుల‌తో స‌రిపెట్టుకోవాల్సి ఉంటుంద‌ని తాప్సీ ఖ‌రాకండిగా చెప్పింది. వారితో సింక్ కాని వాడిని పెళ్లాడ‌న‌ని తెలిపింది.

ఇప్పటివరకు డేటింగ్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ఇదే విష‌యాన్ని చెప్పాన‌ని కూడా తాప్సీ వెల్ల‌డించింది. వివాహం గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరితోనూ ఈ విషయం గురించి బహిరంగంగా చెప్పిందిట‌. అలాగే సంబంధం అనేది భవిష్యత్తు ఉంటేనే.. అప్పుడు మాత్ర‌మే టైమ్ ని పెట్టుబడి పెడతామని... టైమ్ పాస్ చేసేందుకు తనకు ఆసక్తి లేదని తాప్సీ వెల్లడించింది.

త‌నకు కాబోయే వాడి గురించి ఆలోచిస్తూ.. ప్ర‌తిసారీ ఆ కోణం నుండి మాత్రమే చూసింద‌ట‌. అయితే తాప్సీ ఆలోచ‌న‌ల గురించి తెలిసిన త‌ల్లిదండ్రులు మాత్రం కొంత ఆందోళ‌న‌గా ఉన్నార‌ట‌. తాప్సీ అస్సలు పెళ్లి చేసుకోకపోవచ్చని వారు భయపడుతున్నారు.

తాప్సీ త‌న కెరీర్ గురించి మాట్లాడుతూ ``ఇంకా నేను ఆశించిన స్థాయికి ఎద‌గ‌లేదు. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుంటే టైమ్ ఉండ‌దు. కేవ‌లం రెండు సినిమాలతో స‌రిపెట్టుకునే స్థాయికి వ‌స్తే అప్పుడే నా వ్యక్తిగత జీవితానికి అంకితం చేయడానికి నాకు సమయం ఉంటుంది`` అని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం మాజీ బ్యాడ్మింటన్ ఆట‌గాడు.. కోచ్ మాథ్యూస్ బోతో డేటింగ్ చేస్తున్న తాప్సీ.. త‌న బోయ్ ఫ్రెండ్ గురించి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. అన్న‌ట్టు తాప్సీ చెప్పిన కండీష‌న్లు మాథ్యూ విన్నాడో లేదో కానీ ఇటీవ‌ల అస్స‌లు అత‌డి సౌండే వినిపించ‌డం లేదు.
Tags:    

Similar News