ఆ పాపను ఇలా చూడలేకపోతున్నాం

Update: 2016-03-26 17:30 GMT
తెలుగులో చేసిన రెండు సినిమాలతో అస్సలు బ్రేక్‌ రాలేదు ఈ పాపాయికి. ఆమె పేరు తారా అలీషా బెర్రీ. అవ్వడానికి హీరో సైఫ్‌ ఆలీ ఖాన్‌ కు కజిన్‌ సిస్టర్‌ కాని.. తెలుగులో మాత్రం 100% లవ్‌ సినిమాలో నాగచైతన్య గాళ్‌ ప్రెండ్‌ గానే పరిచయం. తన సొంత చెల్లినే ఎక్సపోజింగ్ చేసిందనే నెపంతో బూతులు తిట్టిన సైఫ్‌ ఇక ఈమెను ఏం ప్రమోట్‌ చేస్తాడులే.

ఈ భామ ఇప్పుడు ''లవ్‌ గేమ్స్‌'' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ పత్రలేఖ ఒక సెక్స్‌ ఎడిక్ట్ అయితే.. హీరో ఏమో సెక్స్‌ ను పెయిన్‌ కిల్లర్‌ లా వాడుకునే మనిషి. ఇక తారా అలీషా క్యారెక్టర్‌ కు వస్తే.. అమ్మడు ఒక సెక్స్‌ వస్తువట. ఇప్పుడు ఒక పోస్టర్‌ లో ఈ విషయాలన్నీ చెబుతూ.. ఆమె కళ్ల కిందా పెదాలపైన దెబ్బలు చూపిస్తుంటే మాత్రం.. బాధ కలగడం ఖాయం.

తెలుగులో చక్కగా క్యూట్‌ గా కనిపించిన ఈ భామ.. ఈ హిందీ సినిమాలో మాత్రం విపరీతమైన ఎక్సపోజింగ్‌ చేస్తూనే.. వంటిపైన తన భర్త చేసిన గాయాలను చూపిస్తుంటే జనాలకు గుండె తరుక్కుపోతోంది. ఒక సీన్‌ లో ఏకంగా కేవలం బ్రా తో కనిపిస్తూ.. వీపై తన భర్త ఎలా కాల్చేశాడో చూపిస్తోంది. ఈ సినిమా రిజల్టు అమ్మడి కెరియర్‌ ను ఏం చేస్తుందో తెలియదు కాని.. ఈమె అందాన్ని ఆరాధించే అభిమానులకు మాత్రం ఇది మింగుడుపడట్లేదు.
Tags:    

Similar News