ఫోటో స్టొరీ: టైగర్ కు అటు.. ఇటూ భామలు

Update: 2019-05-06 14:29 GMT
ఈ సమ్మర్లో రిలీజ్ కానున్న బాలీవుడ్ చిత్రాలలో ఆసక్తి రేకెత్తిస్తున చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'.  2012 లో రిలీజ్ అయిన సూపర్ హిట్ చిత్రం 'స్టూడెంట్ అఫ్ ది ఇయర్' కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.  కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పునీత్ మల్హోత్రా దర్శకుడు.  టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో హీరో కాగా అనన్య పాండే.. తారా సుతారియాలు హీరోయిన్లు గా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
 
ప్రోమోలతో ఒక వైపు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతున్నప్పటికీ మరోవైపు ఈ సినిమాలో హీరో హీరోయిన్లు వేసుకునే దుస్తులు.. కాలేజిలో స్టూడెంట్లుగా వారు చేసే విన్యాసాలపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కానీ వాటితో సంబంధం లేకుండా 'స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2' మే 10 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా లీడ్ యాక్టర్స్ బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ మే ఎడిషన్ కవర్ పేజిపై తళుక్కున మెరిశారు.  ఇందుకోసం ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా  దుస్తులు ధరించి స్పెషల్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

బ్లాక్ థీమ్ కావడంతో ఇద్దరూ భామలు డీప్ వీ నెక్ ఉండే గౌన్లలో దర్శనమిచ్చారు. టైగర్ ష్రాఫ్ పొడవాటి గ్రే కలర్ బ్లేజర్ మాత్రమే ధరించి బటన్స్ పెట్టుకోకుండా లోపల షర్టు కూడా వేసుకోకుండా సిక్స్ ప్యాక్ ప్రదర్శన చేస్తుంటే.. ఒక వైపు అనన్య.. మరోవైపు తారా.. టైగర్ ను ప్రేమగా పట్టుకుని పోజిచ్చారు.  సినిమాలో ఈ ముగ్గురూ చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించినా ఈ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం మాత్రం స్టైలిష్ గా మోడరన్ గా ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు.
Tags:    

Similar News