మ‌బ్బుల్లో తార‌క క్యాలెండ‌ర్ కోసం దిగి వ‌చ్చెనే!

Update: 2021-07-23 00:30 GMT
తార సుతారియా.. న‌ట‌వార‌సులు రాజ్య‌మేలే చోట స‌త్తా చాటుతున్న ట్యాలెంటెడ్ గాళ్.. బాలీవుడ్ లో ఇన్ సైడ‌ర్స్ ఔట్ సైడ‌ర్స్ అనే కొట్లాట ఎలా ఉన్నా తారా లాంటి అంద‌గ‌త్తెల హ‌వా ఆగ‌ద‌ని  ప్రూవైంది. క‌ర‌ణ్ జోహార్ లాంటి దిగ్గ‌జం ఈ అమ్మ‌డిని కూడా ప్రోత్స‌హిస్తుండ‌డంతో తారా కెరీర్ ఎదురే లేకుండా సాగుతోంది. జాన్వీ క‌పూర్ .. అన‌న్య క‌పూర్ ల‌తో పాటే ఈ బ్యూటీ కూడా కెరీర్ బండిని సాఫీగా న‌డిపించేస్తోంది.

ఇంత‌కుముందు డ‌బు రత్నానీ క్యాలెండ‌ర్ 2021 పై తారా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇప్పుడు మ‌రో కొత్త ఫోటోషూట్ తో ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది. డ‌బు ర‌త్నాని స్పెష‌ల్ షూట్ తారా అందాన్ని పదింత‌లు పెంచింద‌నే చెప్పాలి. ``కాన్ఫిడెన్స్ ని మించిన అంద‌మైన విష‌యం ఇంకేదీ లేదు`` అంటూ సెల‌విచ్చింది ఈ బ్యూటీ. నిజ‌మే తారా అందాల ఎలివేష‌న్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌దు. హై కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ తో సాటి నాయిక‌ల‌కే ఠ‌ఫ్ పోటీనిస్తోంది. సింపుల్ గా వైట్ టాప్ లో బాట‌మ్ లెస్ లుక్ తో పొడుగు కాళ్ల‌ను ఎలివేట్ చేస్తూ కిల్ చేస్తోంది తారా. డార్క్ ఎల్లో క‌ల‌ర్ బూట్స్ తో మ్యాచింగ్ లుక్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే..  మిలన్ లుథ్రియా రొమాంటిక్-యాక్షన్-డ్రామా త‌డాప్ లో న‌టిస్తోంది. మోహిత్ సూరి `ఏక్ విలన్ రిటర్న్స్` లో కూడా ఆమె నటించనుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ థ్రిల్లర్ లో జాన్ అబ్రహం- అర్జున్ కపూర్- దిశా పటాని కూడా నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్  హెరోపంతి 2 లో కూడా తారా నటించనుంది.
Tags:    

Similar News