అద్భుతమైన కలలు కనే దర్శకుడు రాజమౌళి.. అంతేకాదు.. వాటిని పొల్లు పోకుండా తెరపై ఆవిష్కరించగల నేర్పు కూడా ఆయన సొంతం! అందుకే.. ‘ఈ సీన్ అనవసరంగా పెట్టారు’ అనేవేవీ ఆయన సినిమాల్లో కనిపించవు. నటనలోనూ ‘అలా చేస్తే బాగుండు’ అనిపించే ఫీలింగ్ కూడా కనిపించదు. తన హీరోలు మొదలు.. యాక్టర్ల వరకు అందరి నుంచీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను రాబడతాడు.
అయితే.. జూనియర్ ఎన్టీఆర్ వంటి నటుడు తోడైనప్పుడు ఆయన వందశాతం ఫలితం ఆశిస్తే.. నూటొక్కటి కనిపిస్తుంది తెరమీద! ఇది ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే RRRలో జూనియర్ గోండు బెబ్బులి కొమరం బీమ్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో సంచలనాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు తారక్ యాక్షన్ సీన్స్ గురించి కూడా సమాచారం లీకైంది.
పులితో కొమరం భీమ్ చేసే పోరాటం రోమాంచితంగా ఉంటుందని అంటున్నారు. పులిపై లంఘించి దూకే సన్నివేశాలు గగుర్పాటు కలిగించే రేంజ్ లో చిత్రీకరించాడట జక్కన్న. ఇదే హైలెట్ గా ఉంటుందంటే.. నీటి అడుగున కొనసాగే యాక్షన్ సన్నివేశాలు పీక్ స్టేజ్ లో ఉంటాయని చెబుతున్నారు. ఈ సీన్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతారని అంటున్నారు.
రామ్‌చరణ్ - తారక్ కలిసినటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం దసరా సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాయిదాపడే అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతోంది.