యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోగ్రఫీ స్కిల్ చూశారా? కొడాక్ .. కెనాన్.. సోనీ .. కంపెనీ ఏదైనా తారక్ అదరగొడుతున్నాడు. ఒక పర్ఫక్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎలా షాట్ మూవ్ మెంట్ వెతుకుతాడో అలా గోడ పక్కనే నుంచుని గురి చూస్తున్నాడు తారక్. ఫోటోలు తీయడంలో తనంత స్పెషలిస్ట్ లేడు! అన్నట్టుగానే ఉందీ ఫోజు.
అన్నట్టు `జై లవకుశ` టీమ్ తో కలిసి ఇలాంటి ప్లాన్ చేశాడేమిటి? కొంప తీసి `జై లవకుశ` సీక్వెల్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఏమో.. దానికి తారక్ కానీ.. దర్శకుడు బాబీ కానీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. జై లవకుశ మాస్ థియేటర్లలో ఓ రేంజులో ఆడింది. ఎక్కడో విజయనగరం కొత్తవలసలో మాస్ థియేటర్లో ఈ సినిమా 200 రోజులు ఆడిందంటే అర్థం చేసుకోవచ్చు. జై.. లవ.. కుశ మూడు పాత్రల్లో తారక్ ని అద్భుతంగా చూపించాడు బాబీ. అందుకే ఆ మూవీ కెరీర్ మెమరబుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
టాలీవుడ్ లో ఫోటోగ్రఫీ అంటే అమితంగా ఇష్టపడే హీరోలు ఉన్నారు. ఇంతకుముందు తారక్ ఫ్రెండు రామ్ చరణ్ దక్షిణాఫ్రికాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్కిల్ ని చూశాం. ఉపాసనతో కలిసి స్పెషల్ ఫోటోషూట్లు స్వయంగా చేసారు చెర్రీ. ఇప్పుడు చెర్రీ ఫ్రెండు తారక్ కూడా ఏమీ తగ్గడం లేదుగా.. తన ఫ్రెండ్స్ అయిన బాబీ.. దేవీశ్రీ ప్రసాద్ ఇద్దరినీ కెమెరాలో బంధించాడు. మరోవైపు చరణ్ - తారక్ కలిసి ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో ఫోటోగ్రఫీని ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే.