సుదీర్ఘ షెడ్యూళ్లతో అలసిసొలసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యూరప్ అందాల నడుమ సేద దీరుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ సమేతంగా ఈఫిల్ టవర్ సహా పలు ఎగ్జోటిక్ లొకేషన్లలో ఆయన విహరిస్తున్నారు. యూరప్ అందాల నడుమ ట్రామ్ ట్రైన్లలోనూ ప్రయాణిస్తూ ప్లెజెంట్ వెదర్ ని ఆస్వాధిస్తున్నారు. ఇక తారక్-ప్రణతితో పాటు వారసులు అభయ్ రామ్ - భార్గవ్ రామ్ ఉన్నారు. తమ పిల్లల తొలి ప్యారిస్ ట్రిప్ లో ఐకానిక్ ఈఫిల్ టవర్ ముందు ఇద్దరూ పోజులిచ్చిన సంగతి ఫోటోల రూపంలో వైరల్ అయ్యింది. ఎన్టీఆర్.. అతని భార్య లక్ష్మి ప్రణతి ఇద్దరూ తమ వారసులతో కలిసి ఉల్లాసంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా పేజీలో షేర్ చేయగా వైరల్ గా మారాయి.
తారక్ .. భార్గవ్ రామ్ ఇద్దరూ ఎవరికి వారే ప్రత్యేకం. చిలిపిగా తమాషాగా ఆ ఇద్దరు కిడ్స్ ఈ టూర్ లో రైడ్ కి వెళుతుంటే ఆ ఫోటోల గ్లింప్స్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఒక ఫోటోలో చిన్నారి బాలకుడు తన తండ్రితో సరదా క్షణాలను ఆస్వాధిస్తుంటే.. మామ్ ప్రణతితోనూ కుమారుని గ్లింప్స్ కి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ``నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. కానీ ప్రయాణాన్ని ఆస్వాధిస్తున్నాను``.. అని తారక్ అన్నారు.
పారిస్ (యూరప్) ట్రిప్ లో స్విట్జర్లాండ్ .. ఆస్ట్రియా లాంటి అరుదైన లొకేషన్లకు హైస్పీడ్ రైలులో ఈ కుటుంబం ప్రయాణించిందని కూడా అభిమానులు ఫోటోలను బట్టి భావిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతున్నాడు. కేవలం ఆర్.ఆర్.ఆర్ కోసం ఏకంగా నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తదుపరి అసైన్ మెంట్ లోకి వెళ్లే ముందే పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకు తారక్ ఎంచుకున్న మార్గమిది.