బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా' ఓపెనింగ్ కలెక్షన్స్ తో పాటు వీక్ డేస్ కలెక్షన్స్ కూడా అత్యంత దారుణంగా ఉన్నాయి. ఒకప్పుడు అమీర్ ఖాన్ నటించిన సినిమాలు ఒక్క రోజులో రాబట్టిన వసూళ్లను లాల్ సింగ్ చడ్డా మూడు నాలుగు రోజులు అయినా కూడా రాబట్టలేకపోయింది. దేశవ్యాప్తంగా సినిమా కు నిరాశాజనకమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి.
సినిమా ఫ్లాప్ కు కారణం బ్యాన్ ప్రచారం అంటూ కొందరు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాని గతంలో ఇలా కొన్ని సినిమాల పై బ్యాన్ ప్రచారం జరిగినా కూడా ఆ సినిమాలు మంచి కంటెంట్ ఉండటం వల్ల మంచి విజయాలను సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి.
కొన్ని సినిమాలకు ఆ బ్యాన్ ప్రచారం కలిసి వచ్చి ఎక్కువ వసూళ్లు నమోదు అయిన దాఖలాలు ఉన్నాయి.
ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా కు వచ్చిన ఫలితంకు బ్యాన్ ప్రచారం ఏమాత్రం కారణం కాదు అనేది చాలా మంది అభిప్రాయం. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు మరియు ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కాస్త సీరియస్ గానే ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా పై వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యాయి.
ఒక సినిమాలో మంచి మ్యాటర్ ఉంటే.. మెరిట్ ఉన్న సినిమా అయితే బ్యాన్.. ఐపీఎల్ మ్యాచల్ లు.. వాతావరణం ఇలా ఏ ఒక్కటి కూడా ప్రతికూలంగా మారవు. లాల్ సింగ్ చడ్డా విషయంలో పూర్తి కారణం వాటిగా చెప్పలేం. ఈ సినిమా నే చూసేందుకు యోగ్యత లేని సినిమా గా స్టార్స్ తెలుసుకోవాలి. ఇప్పటికైనా స్టార్స్ నిద్ర లేచి సినిమాల ఎంపిక విషయం లో జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన సూచించాడు.
లాల్ సింగ్ చడ్డా తో పాటు మరో హిందీ సినిమా రక్షాబంధన్ కూడా అదే వారంలో వచ్చింది. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కుప్పకూలాయి. కనుక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సినిమాల ఎంపిక విషయంలో మరియు కథల ఎంపిక విషయంలో నిద్ర లేవాల్సిన అవసరం ఉందంటూ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.