ఎవరూ ఊహించని విధంగా గత ఏడాది హిట్ అయిన పెళ్లి చూపులు సినిమా గురించి అందరికి తెలిసిన విషయమే.. అయితే ఆ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వారు ప్రశంసలను అందుకున్నారు. బాక్స్ ఆఫీస్ తో పాటు అవార్డుల్లో కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది శబాష్ అనిపించుకుంది. పెళ్లి చూపులు చిత్రం ఆ స్థాయిలో విజయం సాధించింది అంటే.. అందుకు కారణం దర్శకుడు తరుణ్ భాస్కర్ అనే చెప్పాలి.
ఎవరు చేయలేని ఒక ప్రయోగాన్ని చేసి తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అయితే ఆ చిత్రం తరువాత తరుణ్ ఏ సినిమాను మొదలు పెట్టలేదు. కానీ త్వరలో ఓ మంచి కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగానే ఆ కథ ఉండబోతున్నట్లు సమాచారం. 2015 లో తండ్రి మరణం తనను ఎంతో బాధకు గురి చేసిందని ఎప్పటికి ఆయనను మర్చిపోలేనని చాలాసార్లు ఇంటర్వ్యూలలో చెప్పాడు. రీసెంట్ గా జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు తరుణ్. ఫ్యామిలీతో తనకు ఉన్న అనుబంధాల తీపి జ్ఞాపకాలను కథగా మార్చి ప్రజెంట్ చేయబోతున్నాడట. అలాగే భాస్కర్ ఆ కథలో తన లవ్ స్టోరీని కూడా కొత్త తరహాలో చూపించబోతున్నాడట. ఓ బెంగుళూర్ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న ఈ దర్శకుడు ఆ కథను కూడా చెబుతాడట.
దీంతో తన రెండవ సినిమాను తరుణ్ తన జీవితంలోని కొన్ని మధురమైన క్షణాలను, అలాగే బాధించిన కొన్ని క్షణాలను ఓ కథగా మలిచి తెరకెకెక్కించడానికి డిసైడ్ అయ్యాడు. పెళ్లి చూపులు తరహాలో కాకుండా ఈ సారి మరో కొత్త ఫార్ములాతో తన రెండవ కథను ప్రజెంట్ చేయనున్నాడట. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతి కలిగేలా చేయాలనీ చూస్తున్నాడట. మరి ఈ సినిమాతో తరుణ్ పెళ్లి చూపులు లాంటి భారీ హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి..