`పెళ్లి చూపులు` చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం డి.సురేష్ బాబు ఆస్థాన దర్శకుడిగా రకరకాల ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కాంపౌండ్ లో వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. `ఈ నగరానికి ఏమైంది` ఫ్లాపయ్యాక ఎందుకనో దర్శకత్వానికి చిన్నపాటి బ్రేక్ నిచ్చాడట. అయితే దర్శకత్వంలోనే కాకుండా నటనలోనూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నిస్తుండడం అభిమానుల్లో చర్చకొచ్చింది. ఈ ధర్మ సందేహానికి తరుణ్ భాస్కర్ స్వయంగా జవాబు చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ``ఇటీవలే మా అమ్మ ఒక నోట్స్ చూపించింది. నేను స్కూల్ పిల్లాడిగా ఉన్నప్పుడు రాసిన వాక్యం అది. పెద్దయ్యాక నటుడవుతానని ఆ నోట్ బుక్ లో రాశాను. దానిని బట్టి లోతుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ నటుడవ్వాలనే అనుకుంటారు. అందరిలానే నేను కూడా అప్పుడు అనుకున్నా. అందుకే ఈ ప్రయత్నం కొత్తది కాదు. పరిశ్రమ నన్ను నటుడిగా అంగీకరించకపోయినా సంతోషమే. తిరిగి నేను దర్శకుడిగానో లేక ఎడిటర్ గానో పని చేస్తాను. నటుడిగా అంగీకరిస్తే అది నాకు చాలా సంతోషాన్నిస్తుంది`` అని అన్నారు.
దీనిని బట్టి ప్లాన్ బి సిద్ధంగా ఉంచుకుని తరుణ్ భాస్కర్ ప్రయోగాలు చేస్తున్నాడని భావించవచ్చు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న `మీకు మాత్రమే చెప్తా` రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. టైటిల్ ని ప్రకటించారు. నిర్మాణానంతర పనులు చేస్తూనే.. ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ సినిమా సంగతుల్ని తెలిపారు. బాలీవుడ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ `ఢిల్లీ బెల్లీ` తరహా చిత్రమిదని తెలిపారు. ఒక ఫిలింమేకర్ గా ఎన్నో నేర్చుకుని నటుడిగానూ నేర్చుకుంటున్నా అని తెలిపారు. ప్లాన్- ఏ అమల్లో ఉండగానే ప్లాన్ బితో మూవ్ అవ్వడం తెలివైన పని తరుణ్ అనుకుంటున్నాడా? అన్నది చూడాలి.