ఆ సినిమాలో షార్ట్ ఫిలిం కష్టాలు

Update: 2018-05-03 05:22 GMT
ప్రస్తుతం యూత్ షార్ట్ ఫిలిమ్స్ బాగా ఇష్టపడుతున్నారు. చూసేవాళ్లకయినా లోటుందేమో కానీ తీసేవాళ్లకు లోటేం లేదు. తక్కువ ఖర్చు.. తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేయగలిగే అవకాశం షార్ట్ ఫిలిమ్స్ కే ఉంది. కాన్సెప్ట్ బాగుంటే పాపులారిటీ కూడా త్వరగా వస్తుంది. బాగా తీయగలిగితే ఇండస్ట్రీలోనూ గుర్తింపు వస్తోంది. అందుకే షార్ట్ ఫిలిమ్స్ తీసేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.

షార్ట్ ఫిలిం తీయడం మరీ అంత ఈజీ ఏమీ కాదు. దానికి ఉండాల్సిన ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్ తో యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నెక్ట్స్ మూవీ తీస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లిచూపులు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ దర్శకుడు తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ తీస్తున్నాడు. ‘‘ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ షార్ట్ ఫిలిమ్స్ తీద్దామని పని మొదలుపెడతారు. గ్రూపులో వాగుడుకాయలా ఉండేవాడు స్క్రిప్ట్ రైటర్ గా మారతాడు. కాస్త చూడ్డానికి బావుండేవాడు యాక్టింగ్ చేస్తాడు. ఫొటోలు తీసుకునే వాడేమో కెమెరామెన్ గా మారతాడు. ఇలాంటి వాళ్లంతా తమ పని పూర్తి చేయడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. వాళ్ల ఇబ్బందులనే ఫన్నీగా చూపించోతున్నాం’’ అంటూ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.

తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ కు నచ్చడంతో ఆ సంస్థే రిలీజ్ చేసింది. తరుణ్ పై నమ్మకంతో ఈసారి మూవీ ప్రొడ్యూస్ చేసింది.  ఈ మూవీలో చాలామంది కొత్త వాళ్లు నటిస్తున్నారు. హీరోగా విష్వక్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా ఫ్యాషన్ డిజైనర్ ఫేం అనీషా ఆంబ్రోస్ నటించింది.  



Tags:    

Similar News